Google: క్రోమ్‌ బ్రౌజర్‌ను విక్రయించేలా గూగుల్‌పై ఒత్తిడి?

Eenadu icon
By Video News Team Published : 20 Nov 2024 13:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

గూగుల్‌ (Google) ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేందుకు.. దాని క్రోమ్‌ బ్రౌజర్‌(Chrome browser)ను విక్రయించేలా పేరెంట్‌ కంపెనీ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేయాలని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ (డీవోజే) కోరనుంది. ఈవిషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ పత్రిక కథనంలో పేర్కొంది. గూగుల్‌ సెర్చ్‌ మార్కెట్‌లో అక్రమంగా ఏకఛత్రాధిపత్యం సాధించిందని ఆగస్టులో రూలింగ్‌ ఇచ్చిన జడ్జి వద్దే ఈ ప్రతిపాదన ఉంచాలని డీవోజే కోరనుందని ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు కృత్రిమ మేధ, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ‌ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన చర్యలను సూచించాలని ఆ న్యాయమూర్తిని కోరనుంది. 

Tags :

మరిన్ని

సుఖీభవ

చదువు