Pune Car Crash: బాలుడి రక్తనమూనా రిపోర్ట్‌నే మార్చేసిన ఫోరెన్సిక్‌ వైద్యులు

పుణెలో లగ్జరీకారు ర్యాష్‌ డ్రైవింగ్‌ కేసులో ట్విస్టులు ఆగడం లేదు. ఇప్పుడు ఏకంగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ డాక్టర్లే రక్త నమూనా పరీక్ష నివేదికను మార్చేందుకు యత్నించినట్లు గుర్తించారు. 

Published : 27 May 2024 15:14 IST

పుణెలో మద్యంమత్తులో వేగంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతికి కారణమైన మైనర్  కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడి రక్త నమూనాను తారుమారు చేసి అతడిని కేసు నుంచి తప్పించేందుకు ఇద్దరు వైద్యులు యత్నించారు. సాసూన్‌ ఆస్పత్రిలోని డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరి హర్నార్ అనే వైద్యులు రక్తనమూనాలను తారుమారు చేసినట్లు పుణె క్రైం బ్రాంచ్ పోలీసులు నిర్ధారించి వారిని అరెస్టు చేశారు.

Tags :

మరిన్ని