బ్రేకింగ్

breaking

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

[22:20]

లాస్‌ ఏంజెల్స్‌: అమెరికాలో కాల్పుల ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. లాస్‌ ఏంజెల్స్‌కు అతి సమీపంలోని బెవర్లీ క్రెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసమూహంలో కలిసిపోయిన దుండగుడు హఠాత్తుగా కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. జనవరి నెలలోనే ఇప్పటివరకు కాలిఫోర్నియాలో కాల్పులు జరగడం ఇది నాలుగో సారి.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని