బ్రేకింగ్

breaking
23 Apr 2024 | 23:31 IST

స్టాయినిస్‌ శతకం.. చెన్నైపై లఖ్‌నవూ విజయం

చెన్నై: ఐపీఎల్‌-2024లో లఖ్‌నవూ ఐదో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైతో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లఖ్‌నవూ బ్యాటర్లలో మార్కస్‌ స్టాయినిస్ (124*; 63 బంతుల్లో) శతకంతో అదరగొట్టాడు. పూరన్‌ (34; 14 బంతుల్లో), దీపక్‌ హూడా (17*; 6 బంతుల్లో) చెలరేగి ఆడారు. చెన్నై బౌలర్లలో పతిరన 2, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 1, దీపక్‌ చాహర్‌ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (108*), శివం దుబే (66) చెలరేగి ఆడారు. లఖ్‌నవూ బౌలర్లలో హెన్రీ, మోసిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని