బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 13:22 IST

రిజర్వేషన్లకు RSS వ్యతిరేకం కాదు: మోహన్‌ భాగవత్‌

హైదరాబాద్‌: రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోందని ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనని చెప్పారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో బేధ భావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను మంచి కోసం వాడాలని హితవు పలికారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని