icon icon icon
icon icon icon

Mohan Bhagwat: రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కీలక వ్యాఖ్యలు

రిజర్వేషన్ల అంశంపై ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు.

Updated : 28 Apr 2024 15:52 IST

హైదరాబాద్‌: రిజర్వేషన్ల అంశంపై ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోందని చెప్పారు. రిజర్వేషన్లకు ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనన్నారు. హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల వేళ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మోహన్‌ భాగవత్‌ అన్నారు. సమాజంలో భేదభావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏఐ ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సోషల్‌ మీడియాను మంచి కోసం వాడాలని హితవు పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img