ఉద్యమకారుడు సీఎం కావడంతోనే ఈ అభివృద్ధి
eenadu telugu news
Updated : 26/10/2021 05:59 IST

ఉద్యమకారుడు సీఎం కావడంతోనే ఈ అభివృద్ధి

ప్రసంగిస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: ఉద్యమకారుడు ముఖ్యమంత్రి కావడంతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం కౌటిల్యా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ విద్యార్థులతో ‘విధాన నిర్ణయాల్లో నా అనుభవం’ అనే అంశంపై ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రభుత్వాధినేత కావడం, ఆయనకు ప్రజలతో ఉన్న సంబంధాలు, స్వీయ అనుభవాలతో షాదీముబారక్‌, రెండు పడక గదుల ఇళ్లు, పల్లె ప్రగతి, ధరణి, రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం వంటి సంక్షేమ, అభివృద్ధి పథకాల రూపకల్పనకు దారి తీశాయని విశ్లేషించారు. రాష్ట్రంలో అపారంగా ఉన్న గనుల విషయంలో రూపొందిస్తున్న విధాన నిర్ణయం చట్టరూపం దాల్చనుందని తెలిపారు. గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌, కార్యదర్శి భరద్వాజ, డైరెక్టర్లు డీవీవీఎస్‌ఆర్‌ వర్మ, సయ్యద్‌ అక్బరుద్దీన్‌, శ్రీధర్‌ ఉన్నారు.  

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని