దిల్లీ ఎల్జీకి నిర్భయ దోషి పిటిషన్‌

తాజా వార్తలు

Published : 09/03/2020 17:42 IST

దిల్లీ ఎల్జీకి నిర్భయ దోషి పిటిషన్‌

దిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. చివరి నిమిషంలో కొత్త పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలు చేసుకోవడంతో ఇప్పటికే మూడు సార్లు ఉరితీత వాయిదా పడింది. తాజాగా దోషుల్లో ఒకడైన వినయ్‌ శర్మ తన శిక్ష తగ్గించాలంటూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌కు అభ్యర్థన పెట్టుకున్నాడు. మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశాడు. జైల్లో ఉన్న సమయంలో తనలో వచ్చిన మార్పు, తన వయసు, తన కుటుంబ సామాజిక-ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్ష తగ్గించాలని కోరాడు. 

పలు వాయిదాల అనంతరం నిర్భయ కేసులో దోషులైన నలుగురిని మార్చి 20 ఉదయం 5.30గంటలకు ఉరితీయాలంటూ దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇటీవల కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి వీరిని ఈ ఏడాది జనవరి 22నే ఉరితీయాల్సి ఉండగా.. న్యాయపరమైన అవకాశాల పేరుతో చివరి నిమిషంలో దోషులు పిటిషన్లు దాఖలు చేయడంతో ఉరితీత వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు దోషులకున్న అన్ని అవకాశాలు మూసుకుపోవడంతో మార్చి 20న ఉరితీత ఖాయంగానే కన్పిస్తోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని