Neha Shetty: నేహాశెట్టి

‘డీజే టిల్లు’తో రాధికగా తెలుగు యువతకు చేరువయ్యారు నటి నేహాశెట్టి (Neha shetty). ఆ సినిమా విజయం తర్వాత తెలుగులో వచ్చిన పలు చిత్రాల్లో ఆమె గ్లామరస్‌ పాత్రలు పోషించారు. బుధవారం నేహాశెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Updated : 06 Dec 2023 13:42 IST
1/7
1999లో.. కర్ణాటకలో జన్మించారు నటి నేహాశెట్టి. 1999లో.. కర్ణాటకలో జన్మించారు నటి నేహాశెట్టి.
2/7
నేహాశెట్టికి చిన్నతనం నుంచి వెండితెర అంటే మక్కువ ఉండేది. నటి కావాలని ఆమె ఎన్నో కలలు కన్నారు. నేహాశెట్టికి చిన్నతనం నుంచి వెండితెర అంటే మక్కువ ఉండేది. నటి కావాలని ఆమె ఎన్నో కలలు కన్నారు.
3/7
కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో శిక్షణ తీసుకుని పలు అందాల పోటీల్లో పాల్గొన్నారామె. ‘మిస్‌ మంగళూరు 2014’ విజేతగా, ‘మిస్‌ సౌత్‌ ఇండియా 2015’ రన్నరప్‌గా టైటిళ్లు కైవసం చేసుకున్నారు. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌లో శిక్షణ తీసుకుని పలు అందాల పోటీల్లో పాల్గొన్నారామె. ‘మిస్‌ మంగళూరు 2014’ విజేతగా, ‘మిస్‌ సౌత్‌ ఇండియా 2015’ రన్నరప్‌గా టైటిళ్లు కైవసం చేసుకున్నారు.
4/7
2016లో విడుదలైన ‘మంగారు మల్లె 2’ అనే కన్నడ సినిమాతో నేహా నటిగా పరిచయమయ్యారు. 2016లో విడుదలైన ‘మంగారు మల్లె 2’ అనే కన్నడ సినిమాతో నేహా నటిగా పరిచయమయ్యారు.
5/7
‘మెహబూబా’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పరాజయం తర్వాత కెరీర్‌ నుంచి కొంతకాలం బ్రేక్‌ తీసుకున్నారు. ‘మెహబూబా’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పరాజయం తర్వాత కెరీర్‌ నుంచి కొంతకాలం బ్రేక్‌ తీసుకున్నారు.
6/7
న్యూయార్క్ ఫిల్మ్‌ అకాడమీ నుంచి యాక్టింగ్‌లో శిక్షణ పొందారు. ఆ తర్వాత వచ్చిన ‘డీజే టిల్లు’ ఆమెకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. న్యూయార్క్ ఫిల్మ్‌ అకాడమీ నుంచి యాక్టింగ్‌లో శిక్షణ పొందారు. ఆ తర్వాత వచ్చిన ‘డీజే టిల్లు’ ఆమెకు మంచి బ్రేక్‌ ఇచ్చింది.
7/7
‘బెదురులంక’, ‘రూల్స్‌ రంజన్‌’తో ఇటీవల అలరించిన ఆమె ప్రస్తుతం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో నటిస్తున్నారు. ‘బెదురులంక’, ‘రూల్స్‌ రంజన్‌’తో ఇటీవల అలరించిన ఆమె ప్రస్తుతం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో నటిస్తున్నారు.

మరిన్ని