Ayesha Khan: అయేషా ఖాన్‌

‘మోత మోగిపోద్ది’ అంటూ తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేసింది అయేషా ఖాన్‌. విశ్వక్‌ సేన్‌తో స్టెప్పులేసి అదరగొట్టింది. వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ గురించి కొన్ని విశేషాలు..

Updated : 26 Mar 2024 21:34 IST
1/12
ముంబయికి చెందిన ఈ ముద్దుగుమ్మ మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. 

2/12
నటనపై ఆసక్తితో అటుగా అడుగులు వేసింది. అలా జూనియర్‌ ఆర్టిస్ట్‌గా ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్‌కి పని చేసింది.

3/12
‘బాలవీర్‌ రిటర్న్స్‌’ సీరియల్‌లో నెగెటివ్‌ రోల్‌లో నటించి, గుర్తింపు తెచ్చుకుంది. 

4/12
బుల్లితెర ప్రేక్షకుల్లో క్రేజ్‌ సంపాదించుకున్న అయేషా ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 17’ (హిందీ)లో పాల్గొంది.

5/12
‘బిగ్‌బాస్‌’కు వెళ్లకుముందే టాలీవుడ్‌లో నటించే అవకాశం అందుకుంది. ఆ సినిమానే ‘ముఖచిత్రం’ (2022).

6/12
అందులో.. హీరోని అమితంగా ప్రేమించే అమ్మాయి మాయా ఫెర్నాండెజ్‌గా ఆకట్టుకుంది. వికాస్‌ వశిష్ఠ, ప్రియా వడ్లమాని ఇతర ప్రధాన పాత్రధారులు.

7/12
తర్వాత, తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. ఇటీవల విడుదలైన ‘ఓం భీమ్‌ బుష్‌’లో రత్తాలు పాత్రలో సందడి చేసింది.

8/12
‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లోని ప్రత్యేక గీతం ‘మోత మోగిపోద్ది’లో డ్యాన్స్‌ చేసి, ఉర్రూతలూగించింది. హోలీ సందర్భంగా ఈ సాంగ్‌ విడుదలైంది.

9/12
విశ్వక్‌సేన్‌, నేహాశెట్టి జంటగా నటించిన ఆ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

10/12
‘లక్కీ భాస్కర్‌’లోనూ ఈ బ్యూటీ భాగమైంది. ఏదైనా కీలక పాత్ర పోషిస్తుందా? ప్రత్యేక గీతంలో నటిస్తుందా? అనేది తెలియాల్సి ఉంది. 

11/12
దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రమిది. 

12/12
దర్శకుడు రాజమౌళితో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇది ఫొటో మాత్రమే కాదు ఓ ఎమోషన్‌’ అని పేర్కొంది. 

మరిన్ని