News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 01 Nov 2025 06:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
ఆదిలాబాద్‌లోని దుర్గానగర్‌ కాలనీలోని శ్రీనవశక్తి దుర్గామాత ఆలయ ప్రాంగణంలో అద్దాల మేడను రూ.25 లక్షల వ్యయంతో నిర్మించారు. అమ్మవారి అలంకరణ గదిలో అష్టకోణాల దర్పణాలను బిగించారు. మధ్యలో ఉయ్యాలను ఏర్పాటు చేశారు. కంచి పీఠం నుంచి తెచ్చిన పంచలోహ దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.  

2/6
హాలీవుడ్‌ సినిమాల్లోని హాలోవీన్‌ పాత్రలన్నీ కళ్లముందు ప్రత్యక్షంకావడంతో సందర్శకుల ఆనందానికి అవధుల్లేవు. మాదాపూర్‌ హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న హైదరాబాద్‌ కామిక్‌ కాన్‌ వేడుక శుక్రవారం ప్రారంభమైంది. కామిక్‌ కథల ఆధారంగా రూపొందించిన యానిమేషన్‌ సిరీస్‌లు, కార్టూన్‌ సీరియల్స్, సినిమా పాత్రల వేషధారణలు, ఆయుధాలు ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నాయి.ఈ-గేమింగ్‌ పోటీలు, చెస్, క్యారమ్స్‌ పోటీలు నిర్వహించారు. 
 
3/6
ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో శుక్రవారం సాయంత్రం కార్తిక దీపోత్సవం కనుల పండువగా జరిగింది. మహిళలు దీపాలు వెలిగించారు. రాత్రి 7 గంటలకు భద్రకాళి అమ్మవారి ఉత్సవమూర్తికి పల్లకీ సేవ జరిగింది. మహబూబాబాద్‌ ఎంపీ పొరిక బలరాంనాయక్, సినీ దర్శకుడు వంగ సందీప్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.      

4/6
ఆర్కేబీచ్‌లోని టీయూ-142 యుద్ధ విమాన ప్రాంగణంలో శుక్రవారం నుంచి ‘మాయా ప్రపంచం’ అందుబాటులోకి వచ్చింది. ఇందులోని అద్దాల గదుల్లోకి అడుగుపెడితే సరికొత్త అనుభూతి పొందుతారని నిర్వాహకులు చెబుతున్నారు.  

5/6
ఏలూరు తూర్పువీధిలో గంగానమ్మ జాతర మహోత్సవానికి శుక్రవారం శాస్త్రోక్తంగా ముడుపుకట్టి శ్రీకారం చుట్టారు. ఆపై రాటోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేసిన అమ్మవారి భారీ ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  

6/6
 పాలేరు జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. పరివాహక ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి వరకు ఉద్ధృతంగా ప్రవహించిన పాలేరు నది శాంతించింది. శుక్రవారం తెల్లారుజాము నుంచే వరద ప్రవాహం, జలాశయం నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. 

Published : 01 Nov 2025 05:55 IST

మరిన్ని

సుఖీభవ

చదువు