News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 04 Nov 2025 06:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
కడప: కార్తిక మాసం పూల రైతులకు కలిసొచ్చింది. మొన్నటి వరకు గిట్టుబాటు కావడం లేదంటూ పలువురు రైతులు రహదారి పక్కన పారబోశారు. ఇప్పుడు వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నటి వరకు కిలో రూ.800గా ఉన్న కదిరి మల్లెపూల ధర ఇప్పుడు రూ. 1200కు చేరింది. కాగడాలు కిలో రూ. 800, చామంతి రూ. 300, బంతిపూలు రూ.70 పలుకుతున్నాయి. కమలాపురం నియోజకవర్గంలో వందల ఎకరాల్లో చామంతి సాగు చేస్తున్నారు. ఇవన్నీ పూలతో కళకళలాడుతున్నాయి.  

2/6
కార్తిక సోమవారం సందర్భంగా తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వర స్వామిని ప్రత్యేక అలంకరించి.. అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు కార్తికదీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు.
 
3/6
వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌ ప్రాంతంలోని పంట పొలాల్లో కలియ తిరుగుతున్న ట్రైకలర్‌ మునియా పక్షి ఇది.  

4/6
మార్టూరు మండలం బొల్లాపల్లి గ్రామం వద్ద ఈ మహావృక్షం ఊడలే ఆధారంగా విస్తరిస్తోంది. 200 ఏళ్ల నాటి మర్రిచెట్టు రహదారి నిర్మాణానికి ఆటంకంగా మారడంతో పూర్వీకులు కొంచెం నరికేశారు. అనంతరం ఊడలే పెనవేసుకుని ఎకరం మేర విస్తరించిందని గ్రామస్థులు చెబుతున్నారు. వాహనదారులకు నీడతో పాటు పచ్చదనంతో ఆహ్లాదం పంచుతోంది. 

5/6
పిఠాపురం: కార్తిక సోమవార పూజలు అంతటా భక్తిశ్రద్ధలతో జరిపించారు ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాల్లో అభిషేకాలు చేయించారు. శివయ్యను వేడుకుని మహిళలు తమ ఇంటిల్లిపాదినీ చల్లగా చూడాలని వేడుకున్నారు. శివలింగాలకు అలకరణలు చేసి తరించారు. 

6/6
šభీంపూర్‌: íన్‌గంగా నదీ తీరం సోమవారం రాత్రి కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక మాసం పురస్కరించుకుని మహిళలు, యువతులు దీపాలు వెలిగించి అంతర్గాం సమీపంలోని నదీ తీరంలో వదిలారు. వడూర్‌ శివారులో శబరిమాత ఉపాసకులు శివానంద భారతి ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. అక్కడి వాగులో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. 
 
Published : 04 Nov 2025 06:29 IST

మరిన్ని

సుఖీభవ

చదువు