News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 02 Nov 2025 05:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
మన్యంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. మొంథా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు నాలుగురోజుల పాటు మంచు జాడ లేదు. వర్షాలు తెరిపివ్వంతో మంచు కురుస్తోంది. పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. శనివారం ఉదయం పెదబయలు మండలం కిముడుపల్లి ఘాటీలో శనివారం ఉదయం మంచుదుప్పటి పరుచుకున్న దృశ్యమిది. 

2/6
మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పోరుమామిళ్ల చెరువు నిండుకుండను తలపిస్తోంది. గత నెలలో బ్రహ్మంసాగర్‌ నుంచి 0.50 టీఎంసీ నీటిని నింపారు. ఇటీవల వర్షాలకు మలిదేవు వాగు నుంచి అధికంగా వరద నీరు వచ్చింది.మొత్తంగా 0.72 టీఎంసీల నీటితో చెరువు కళకళాడుతూ కనువిందు చేస్తోంది.  

3/6
ద్వారకాతిరుమల శ్రీనివాసుడు హంస ఆకృతిలో ఉన్న తెప్పపై స్థానిక నృసింహసాగర్‌(పుష్కరిణి)లో జల విహారం చేసేందుకు ఆలయాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 2న రాత్రి 8 గంటలకు ఈ వేడుక నేత్రపర్వంగా జరగనుంది. ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. 

4/6
కోటబొమ్మాళి: ఇటీవల వచ్చిన మొంథా తుపాను ప్రభావం తర్వాత  చలి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా దట్టంగా మంచు కురుస్తోంది. శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు కమ్మేయడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి.జలుమూరు మండలం తిలారు రైల్వే గేటు వద్ద శనివారం ఉదయం 7 గంటల సమయంలో పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. 

5/6
సిక్కుల మత గురువు గురునానక్‌ దేవ్‌ జీ మహరాజ్‌ జయంతి వేడుకలు సికింద్రాబాద్‌ గురుద్వారాలో శనివారం ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పూజలు, నగర సంకీర్తన(శోభాయాత్ర) చేపట్టారు. దారి పొడవునా కత్తి, కర్రసాము, గట్కా తదితర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

6/6
కార్తిక మాసం సందర్భంగా చిన్నగొట్టిముక్ల గ్రామం చాకరిమెట్లలోని ప్రసిద్ధి చెందిన సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంతో పాటు ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. హైదరాబాద్‌ జంట నగరాలు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణ స్వామి మండపంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. 

Published : 02 Nov 2025 05:50 IST

మరిన్ని