News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 03 Nov 2025 06:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
కోనసీమ: సంధ్యా సమయంలో పచ్చనికొబ్బరి చెట్లు వెనుక ఆకాశం ఎరుపెక్కింది. అరుణకాంతుల మధ్య సూర్యబింబం పడమటి నుదుటున బొట్టులా దర్శనమిచ్చింది.  అయినవిల్లి మండలం నేదునూరులో ఆదివారం సాయంత్రం 6.20 గంటలకు కనువిందు చేసిన దృశ్యమిది. 

2/6
శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మన్యంలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ధారాలమ్మ ఘాటీలో ఆదివారం ఉదయం పాలసముద్రం దర్శనిమిచ్చింది.      ఈ అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. ధారాలమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ దృశ్యాలను తమ చరవాణుల్లో బంధించారు.  

3/6
చుట్టూ కొండలు.. హరిత సిరులు.. పాలధారలా జలపాతాలు.. మధ్యలో పాలకొండల పాద భాగాన నిండుకుండలా బుగ్గవంక జలాశయం.. వర్షాకాలంలో కనువిందు చేసేలా ఉంటుందీ ప్రదేశం. ఇటీవల మొంథా తుపానుతో బుగ్గవంక ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో మరింత అందంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ప్రకృతి ప్రేమికుల కళ్లను కట్టిపాడేస్తోంది. 

4/6
ఎత్తయిన కొండలు.. పచ్చని అందాల మధ్య నుంచి పాల నురగలా పరవళ్లు తొక్కుతూ పారుతోన్న కైగల్‌ జలపాతం సందర్శకులను ఆకర్షిస్తోంది. ఇటీవల వర్షాలతో  ప్రవాహం పెరిగింది. పర్యాటకులు తరలివస్తున్నారు.  

5/6
ఎండాడ: ఓ వైపు సముద్రపు గాలులు, మరోవైపు పచ్చటి కొండల నడుమ రుషికొండపై తిరుమల తిరుపతి దేవస్థానం (తి.తి.దే.) నిర్మించిన మహాలక్ష్మీ గోదాదేవి సహిత వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం కనువిందు చేస్తోంది. ప్రాంగణం నలువైపులా ఏపుగా పెరిగిన పూల మొక్కలు, పచ్చని గడ్డితో కళకళలాడుతోంది. 

6/6
వందలాది తాటి చెట్లు, వరి పొలాలు, మధ్యలో చెరువు, ఒడ్డున ఎల్లమ్మ దేవాలయం.. వెరసి ప్రకృతి గీసిన పెయింటింగ్‌లా చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామ శివారులో నువ్వన్న గుట్ట వద్ద ప్రకృతి అందాలు ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. 
 
Published : 03 Nov 2025 06:18 IST

మరిన్ని

సుఖీభవ

చదువు