News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (05-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 05 Oct 2025 07:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/7
2/7
 విశాఖ కళా భారతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం విద్యార్థినులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఆకట్టుకునే ఇతి వృత్తాలతో సాగిన నృత్యాభినయం కట్టిపడేసింది. 

3/7
హనుమకొండలోని చారిత్రక పద్మాక్షి దేవాలయం కోనేరులో శనివారం రాత్రి నిర్వహించిన తెప్పోత్సవం కనులపండువగా సాగింది. తొలుత కుంభ ఆవాహన, గణపతి పూజ, వరుణపూజలతో కార్యక్రమం ప్రారంభించారు. కోనేరులో నవపరిక్రమము ప్రదక్షిణలు జరిపించారు. ఉదయం సమయంలో పద్మాక్షి దేవి శాంతి కల్యాణం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగింది.

4/7
చిత్రాన్ని చూస్తే విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్‌ చేసినట్లుందికదా.. అయితే మీరు పొరబడినట్లే. హైదరాబాద్‌- వరంగల్‌ రహదారిలో చెంగిచెర్ల క్రాస్‌ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ ముఖద్వారం వద్ద అలంకరణ, ఆకర్షణ కోసం ఉంచిన లోహవిహంగ నమూనా ఇది.

5/7
సాధారణంగా నెమ్మదిగా నడిచేవారిని తాబేలు నడకతో పోలుస్తుంటారు. కానీ ఇక్కడ కనిపించే ఈ కూర్మం పరుగెడుతుంది. అదేంటి అని ఆశ్చర్యపోకండి. ఉస్మానియా వర్సిటీలోని నాన్‌ టీచింగ్‌ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఉంచిన తాబేలు ఆకారంలోని శకటం ఇది. దీన్ని శుభకార్యాలు, పండగల సందర్భంగా నిర్వహించే ఊరేగింపుల్లో వాహనాలకు జతచేసి ర్యాలీ తీస్తుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 

6/7
జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువు వద్ద కనిపించిన దృశ్యాలివి. సెల్ఫీలు, రీల్స్‌ మోజులో యువత హద్దు దాటుతున్నారు. అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినా రెయిలింగ్‌లు ఏర్పాటు చేసినా పట్టించుకోకుండా ప్రాణాలను పణంగా పెడుతున్నారు. 

7/7
Published : 05 Oct 2025 07:35 IST

మరిన్ని

సుఖీభవ

చదువు