News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (08-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 08 Oct 2025 07:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/10
మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ పోటీలకు విశాఖ స్టేడియం సిద్ధమైంది. ఈ నెల 9న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. భారత జట్టు ఇప్పటికే రెండు వరుస విజయాలతో జోరుమీదుంది. క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకునేలా, టోర్నీకి ప్రచారం సాగేలా స్టేడియం ముందు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటుగా వెళ్లే ప్రతి ఒక్కరిని ఇవి ఆకర్షిస్తున్నాయి. 

2/10
3/10
పద్మనాభంలో అనంత పద్మనాభ స్వామి కొండపై నుంచి చూస్తే  గోస్తనీ నది, దానిపై వంతెన చూడముచ్చటగా కనిపిస్తాయి. కొండ దిగి వంతెనపై ప్రయాణం చేస్తే అసలు సంగతి తెలుస్తుంది. వంతెన పొడవునా దారి దెబ్బతింది. రక్షణగా ఉండాల్సిన రెయిలింగ్‌ విరిగి ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

4/10
ఓ మిస్సైల్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి జాతీయ రహదారిని దాటుకుంటూ వెళ్తున్నట్టుగా కనిపించిన ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఆనందపురం నుంచి తగరపువలస వెళ్లే జాతీయ రహదారి మార్గంలో మంగళవారం ఏర్పడిన ఇంద్రధనస్సు ఇది. అటుగా వెళ్లే వారు ఎంతో   ఆసక్తిగా తిలకించారు. 

5/10
 బంధుత్వం గొప్పతనాన్ని చూపించిన ‘బలగం’ సినిమా గుర్తు చేసేలా కలుసుకున్నారు మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన సురిగి వారి కుటుంబ సభ్యులు. మూడు తరాలకు చెందిన వారంతా మంగళవారం సమ్మేళనం ఏర్పాటు చేసుకొని ఒకచోట కలిసి ఆత్మీయ అనుబంధాలను ఒకరికొకరు పంచుకున్నారు. చిరస్థాయిగా గుర్తుండి పోయేలా అత్తలు కోడళ్లకు, వదినలు మరదళ్లకు పట్టుచీరలను అందజేశారు. వారి ఆడపడుచులకి 5 కేజీల తూకంతో ఉన్న గిన్నెలకు బహుమతిగా ఇచ్చారు. ఆటపాటలతో సందడి చేశారు.

6/10
 కూలీలను తరలించే క్రమంలో గుత్తేదారులు చాలా అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. చిన్న ట్రాలీ వాహనాలలో రెండు, మూడు కుటుంబాల సభ్యులను సామగ్రితో కుక్కి వందల కి.మీ. పంపుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు కూడా మిన్నకుండిపోతున్నారు. మంగళవారం ఉదయం గుంటూరు నుంచి చౌటుప్పల్‌కు వస్తున్న ఓ ట్రాలీ వాహనంలో సామగ్రి సర్దగా కూర్చోడానికి స్థలం లేకపోవడంతో ఇద్దరు చిన్నారులు వాహనంలో ఎక్కించిన ద్విచక్రవాహనం సీటుపై ఇలా ఎటూ కదలలేనిస్థితిలో కూర్చుండిపోయారు. హైదరాబాద్‌ విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి వద్ద ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన దృశ్యమిది.

7/10
మండలంలోని విఠోలి సమీపంలో రాళ్ల చెరువుకు మంగళవారం ఉదయం గండిపడింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులోకి భారీగా నీరు చేరింది. దీంతో అలుగు పక్కన కట్టకు గండిపడటంతో నీరంతా బయటకు వెళ్లింది. కట్ట కింద పంట పొలాలు నీట మునిగాయి. కట్ట బలహీనంగా ఉందని రెండు నెలల క్రితం నీటిపారుదల శాఖ అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. 

8/10
 ఓవైపు చిటపట చినుకులు.. మరో వైపు భానుడు ప్రతాపంతో ఎండలు కాస్తుండటంతో అదే సమయంలో సోన్‌ గోదావరి నది పాత వంతెనపై ఇలా హరివిల్లు విరిసింది. సప్త వర్ణాలతో వంతెనపై ప్రయాణించే వాహనదారులకు కనువిందు చేసింది.

9/10
 హెచ్‌సీయూలో మంగళవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో వివిధ రాష్ట్రాల విద్యార్థులు  వారి సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. 

10/10
రాజ్‌భవన్‌లో మంగళవారం గాంధీ జయంతి వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. శాంతి, ప్రేమకు మహాత్ముడు చిహ్నమని, ఆయన మార్గం ఆదర్శమని గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ కొనియాడారు.

Published : 08 Oct 2025 07:00 IST

మరిన్ని

సుఖీభవ

చదువు