News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (10-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 10 Oct 2025 05:58 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
 ఏకశిలా నగరం వరంగల్‌ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఖిలా వరంగల్‌ మధ్యకోట కీర్తి తోరణాల నడుమ నాట్య మండపంలో ఓ నృత్య భంగిమ ఆకట్టుకుంటోంది. ముగ్గురు నాట్యం చేస్తున్నట్లు ఉన్న ఈ ప్రతిమలో.. కాళ్లు మాత్రం నాలుగే ఉన్నాయి. కానీ! ఎటువైపు నుంచి చూసినా.. ముగ్గురికి రెండేసి కాళ్లున్న భ్రాంతి కలుగుతుండటం అప్పటి శిల్పుల మేథో సంపత్తికి నిదర్శనం. 

2/6
భారీ వర్షాలతో కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ పెద్ద చెరువు జలకళ సంతరించుకుంది. సూర్యాస్తమయ సమయంలో ఆకాశం ఎరుపెక్కగా.. చెరువు నీరు అదే రంగును సంతరించుకొని కనువిందు చేసింది. ప్రకృతి ప్రేమికులు ఆ చిత్రాలను తమ చరవాణుల్లో బంధించి.. మురిసిపోయారు.   

3/6
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బైపాస్‌ రోడ్డులోని కూడలిలో ఆపిల్‌ పండు బొమ్మ ఆకట్టుకుంటుంది. దూరం నుంచి చూస్తే భారీ పరిమాణంలో అచ్చు యాపిల్‌లా ఉంటుంది. ఆరేళ్లక్రితం ఏర్పాటుచేసిన ఈ బొమ్మ చూడముచ్చటగా కనిపిస్తూ వాహనదారులకు, మండల వాసులకు ఆనందాన్ని కలిగిస్తుంది. 

4/6
మన్యంలో దాలియాపూల అందాలు కనువిందు చేస్తున్నాయి. ఏటా ఆగస్టు నుంచి మూడు నెలలపాటు ఇవి పూస్తాయి. ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో గిరిజనులు ఇంటి పెరట్లో పెంచుతున్నారు. వర్షాలకు ఈ పూలు విరబూసి ఆకట్టుకుంటున్నాయి.  

5/6
తిరుమలలో గురువారం ఉదయం వర్షం కురిసింది. కొద్దిపాటి వానకే మాడవీధుల్లోకి నీరు చేరింది. అనంతరం వర్షం తగ్గడంతో సాధారణ స్థితికి చేరుకుంది. తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. 

6/6
జాతీయ రహదారిపై ఓ పడవ లారీపై రయ్‌.. రయ్‌ మంటూ ముందుకు సాగుతూ కనిపించింది. ఈ భారీ పడవను గురువారం కత్తిపూడి నుంచి విశాఖపట్నం తీసుకెళ్తున్నారు. బెండపూడి వద్ద లారీ ఆగడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ దీన్ని ఆసక్తిగా తిలకించారు.   

Published : 10 Oct 2025 05:54 IST

మరిన్ని

సుఖీభవ

చదువు