- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (11-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/11
                        
                         ఓవైపు అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న కొండ. మరో వైపు వంపుల వయ్యారంతో పరవళ్లు తొక్కుతున్న గోస్తనీ నది. ఇటీవల కురిసిన వర్షాలకు నది నిండుగా ప్రవహిస్తూ పొట్నూరు, మద్ది, కురపల్లి, మునివానిపేట ఆనకట్టల వద్ద జోరుగా ముందుకు సాగుతోంది. 
                    2/11
                        
                        
                    3/11
                        
                        హసన్‌పర్తి మండలంలోని అనంతసాగర్ శివారు ఎస్సార్ విశ్వ విద్యాలయంలో శుక్రవారం  నూతన విద్యార్థుల స్వాగత కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. వర్సిటీ ఛాన్స్‌లర్ వి.మహేశ్, ఆచార్యులు పి.వెంకట రమణారావు, ఏవీవీ సుధాకర్ వేడుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి. అమ్మాయిల ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది. సినీ గాయకులు దామిని బాట్ల, అర్జున్ విజయ్ తమ పాటలతో ఉర్రూతలూగించారు. వారి గళానికి విద్యార్థులు పాదం కదిపారు. కార్యక్రమం రాత్రి వరకు ఉత్సాహంగా సాగింది.
                    4/11
                        
                        నల్లమల అటవీ ప్రాంతంలో కనుచూపు మేర విస్తరించిన పచ్చని గుట్టలు.. ఇరువైపులా సాగవుతున్న పంట పొలాలు.. నడుమ వంకలు తిరిగి పాములా వయ్యారంగా ఉన్న రోడ్డు.. ఇలా ఆ దారిలో సాగిపోతుంటే మనసుకు ఎంతో హాయి.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేం కదండీ.. సాగర్ వెనకజలాలు విస్తరించిన నేరెడుగొమ్ము మండలంలోని బుగ్గతండా నుంచి దేవరకొండకు వెళ్లే మార్గం ఇది. దీనికి సమీపంలోని పర్యాటక ప్రాంతం వైజాగ్ కాలనీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 
                    5/11
                        
                        కొంత కాలంగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లోని రహదారుల్లో రెండువైపులా పెద్దఎత్తున పొదలు పెరిగాయి. కొన్ని చోట్ల రహదారిని సగానికిపైగా ఆక్రమించేశాయి. మలుపుల వద్ద మరీ ప్రమాదకరంగా మారాయి. ఎదురుగా ఎవరు వస్తున్నారనేది తెలియడం లేదు. పలు చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి రహదారులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
                    6/11
                        
                        సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రధాన రహదారి ఇరుకుగా మారింది. బస్సులు మలుపు తిరిగేందుకు, ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలతో ఈ ప్రాంతం నిత్యం రద్దీతో ఉంటుంది. నూతన స్టేషన్ నిర్మాణం పూర్తయితే..రాకపోకలు మరింత పెరిగి ట్రాఫిక్ తిప్పలు మరింత పెరిగే అవకాశం ఉంది. 
                    7/11
                        
                        
                    8/11
                        
                        
                    9/11
                        
                         అటు ఫ్యాషన్ షో.. ఇటు నృత్యాలతో విద్యార్థినులు ఆకట్టుకున్నారు. రాయదుర్గంలోని ఫుట్ వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ‘ఇబ్తిదా’ వేడుకలు  శుక్రవారం ముగిశాయి. స్వయంగా వారే డిజైన్ చేసిన వస్త్రాలను ధరించి  ర్యాంప్ వాక్ చేసి అలరించారు. 
                    10/11
                        
                         నగర శివారు తారామతిపేట్ ఔటర్ ఎగ్జిట్ 10 సమీపంలోని మూసీ కాలువ వద్ద గురువారం అర్ధరాత్రి భారీ మొసలి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.అటవీ శాఖ, జూపార్కు సిబ్బంది వచ్చి సుమారు 120 కిలోల బరువున్న మొసలిని  బంధించి జూపార్కుకు తరలించారు.
                    11/11
                        
                         ప్రపంచంలో రెండో అతిపెద్ద లోహ విహంగమైన అంటొనొవ్ ఏఎన్-124 రుస్లాన్ కార్గో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం తొలిసారిగా దిగింది. జీహెచ్‌ఐఏఎల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. దీనికి నాలుగు ఇంజిన్లు ఉంటాయని, ఆగకుండా 4,650 కిలోమీటర్లు ప్రయాణించగలదని అధికారులు తెలిపారు.
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 11 Oct 2025 06:36 IST	
	  
    మరిన్ని
- 
                    
                            ఆకట్టుకున్న వెజిటబుల్స్ ప్రదర్శన - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
 - 
                        
                            

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అపరెల్ గ్రూప్‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
 - 
                        
                            

కొలికపూడి, కేశినేని పంచాయితీ.. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
 - 
                        
                            

యువత ‘రీల్స్’లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
 - 
                        
                            

కార్తిక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం వెనుక పురాణ గాథలు తెలుసా?
 - 
                        
                            

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
 


