News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (12-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 12 Oct 2025 06:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
దట్టమైన అటవీ ప్రాతమైన పాలకొండలోని కొండ చివరిలో  రామాపురం మండలం రాచపల్లె పంచాయతీ గంగనేరు సమీపంలోని పాలకొండల్లో శ్రీవారి పాదాలు దర్శనమిస్తుంటాయి. 

2/6
ఈ చిత్రాలు కడప నగరం దేవుని కడప చెరువులోనివి. చెరువు నిండుగా నీరు ఉండటంతో పలు రకాల పక్షులు ఆవాసం ఏర్పరచుకున్నాయి. తమ కిలకిలరావాలతో సందడి చేస్తున్నాయి. స్థానికంగా నీటి కోళ్ల పేరుతో పిలిచే పక్షులు నీటిలో ఆధిపత్య పోరుకు దిగాయి. 

3/6
పాచిపెంట మండలం ఆలూరు గిరిజన గ్రామ సమీపంలోని దారగెడ్డ జలపాతం అందాలతో కట్టిపడేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు దారగెడ్డలో ప్రవాహం పెరిగి నీరు కొండలపై జాలువారుతూ కనువిందు చేస్తోంది. యువత, సందర్శకులు ఇక్కడి అందాలను ఆశ్వాదిస్తూ సందడి చేస్తున్నారు. ఒడిశా నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. 

4/6
శ్రీవారు చదువులతల్లిగా సాక్షా త్కరించి భక్తజనులను సమ్మోహనపరిచారు. వాడపల్లి వేంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం మలయప్పస్వామి వీణ ధరించి హంస వాహనరూఢుడై వివేకం ప్రభో దించారు. ఆ సుందర మూర్తికి అర్చకుల పుష్పార్చన చిత్రమిది.  

5/6
వడ్డేశ్వరం కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో శనివారం నిర్వహించిన ‘సమ్యక్‌-2025’ ముగింపు కార్యక్రమం కనులపండువగా సాగింది. సినీ గాయని గీతా మాధురి ఆలపించిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఊర్రూతలూగించాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సైన్స్‌ ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. 

6/6
నక్కపల్లి: సాలె పురుగులు ఎక్కువగా ఊదా రంగులో ఉంటాయి. నక్కపల్లిలో ఓ చెట్టుపై గూడు కట్టిన సాలీడు తెలుపు, పసుపు, నలుపు, నాచు ఇలా విభిన్న వర్ణాల కలబోతతో చూపరులను ఆకట్టుకుంది. 

Published : 12 Oct 2025 06:14 IST

మరిన్ని

సుఖీభవ

చదువు