News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (14-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 14 Oct 2025 06:31 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/7
ఒడిశాలోని చిలికా సరస్సుకు ఏటా శీతాకాలంలో లక్షలాది విదేశీ, స్వదేశీ పక్షులు వలస వస్తుంటాయి. ఈ ఏడాది చిలికాకు పక్షుల రాక మొదలైంది. దీంతో చిలికా వన్యప్రాణి డివిజన్‌ పక్షుల భద్రతకు చర్యలు చేపట్టింది. విహంగాల భద్రతకు 21 పక్షుల భద్రతా శిబిరాలు ఏర్పాటు చేశామని చిలికా వన్యప్రాణి డివిజన్‌ అధికారి (డీఎఫ్‌ఓ) అమ్లాన్‌ నాయక్‌ సోమవారం సాయంత్రం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఒడిశాలోని చిలికా సరస్సుకు ఏటా శీతాకాలంలో లక్షలాది విదేశీ, స్వదేశీ పక్షులు వలస వస్తుంటాయి. ఈ ఏడాది చిలికాకు పక్షుల రాక మొదలైంది. దీంతో చిలికా వన్యప్రాణి డివిజన్‌ పక్షుల భద్రతకు చర్యలు చేపట్టింది. విహంగాల భద్రతకు 21 పక్షుల భద్రతా శిబిరాలు ఏర్పాటు చేశామని చిలికా వన్యప్రాణి డివిజన్‌ అధికారి (డీఎఫ్‌ఓ) అమ్లాన్‌ నాయక్‌ సోమవారం సాయంత్రం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.
2/7
బోథ్‌: సొనాల మండలంలోని పలు ఆదివాసీ గ్రామాల్లో సోమవారం భోగి పండగ నిర్వహించారు. దీపావళి సందర్భంగా ఆదివాసీలు ధరించే గుస్సాడీ టోపీ, సంప్రదాయ వాయిద్యాలకు పూజలు నిర్వహించారు. మహిళలు ప్రత్యేక పూజలు చేసి.. నైవేద్యాలు సమర్పించారు.  

3/7
హైదరాబాద్‌: అటు చిరుజల్లు.. ఇటు తొలిమంచు.. కలగలిసి కురిశాయి. సోమవారం ఉదయం నగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. అదే సమయంలో సన్నని మంచు కురవడంతో ఎల్బీనగర్‌ కూడలి వద్ద కనిపించిన దృశ్యమిది. 

4/7
అలంపూర్‌: ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరునికి ప్రీతికరం కావడంతో సోమవారం బాల బ్రహ్మేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. గోపూజ అనంతరం స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
5/7
ఎక్కడో దూరంగా ఉన్న చెట్టుపై ఒక్క రామ చిలుక కనిపిస్తే చాలు ఎంతో సంబరపడిపోతుంటాం. అలాంటిది ఇంటి ప్రాంగణంలో పదుల సంఖ్యలో కిలకిలరావాలు చేస్తుంటే ఇక ఆనందానికి అవధులే ఉండవు కదూ! అలాంటి దృశ్యమే ఇది. పద్మనాభంలో బి.కనకరాజు, ఆయన స్నేహితుడు నిత్యం పక్షుల కోసం ప్రహరీపై బియ్యం గింజలు వేస్తుంటారు. ఉదయాన్నే వివిధ రకాల పక్షులు వాటిని ఆరగించి వెళ్తుంటాయి. కొద్ది రోజులుగా రామచిలుకలు సైతం పదుల సంఖ్యలో రావడం.. అవన్నీ ఒకేచోట కనబడటం ఎంతో ముచ్చట గొలుపుతోంది.     

6/7
విశాఖ-భీమిలి బీచ్‌ రోడ్డులో ఓ స్టూడియోలో పాత టైర్లనూ ఇలా వినూత్నంగా అలంకరించారు. టైర్లకు రంగులు వేసి చిన్న భవనానికి చూడముచ్చటగా అమర్చారు. కొన్నింటిలో మొక్కలు పెట్టి ఆకర్షణీయంగా అలంకరించారు. 

7/7
ఆర్కే బీచ్‌లోని సముద్ర జలాల్లో రాళ్లు నాచుపట్టి ఉంటాయి. కొన్నిసార్లు జలాలు వెనక్కి వెళ్లినప్పుడు రాళ్లపై నాచు చూసేందుకు  ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీంతో సందర్శకులు ఆ పక్కనే నిల్చొని స్వీయ చిత్రాలు తీసుకుంటూ మురిసిపోతున్నారు. 

Published : 14 Oct 2025 06:09 IST

మరిన్ని

సుఖీభవ

చదువు