News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (15-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 15 Oct 2025 06:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
జిల్లాకు కట్టని గోడలా కనుచూపుమేర ఉండే పాలకొండలు.. వర్షాల రాకతో పచ్చకోక కట్టుకున్నాయి.. పైన మేఘాలతో దోబూచులాడుతూ, పరుచుకున్న జల తరంగిణిలో తమ అందాలను చూసి మురిసిపోతున్నట్లుంది కదూ ఈ దృశ్యం. గువ్వల చెరువు ఘాట్‌ సమీపంలోని సుగాలి బిడికి వద్ద చెరువు అద్దంలా మారగా అందమైన కొండల ప్రతిబింబం అందులో అందమైన చిత్తరువుగా మారింది.  

2/6
నాచారం  శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో  శ్రీనివాస కల్యాణం  మంగళవారం  వైభవంగా జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పురవీధుల్లో గరుడవాహన సేవ నిర్వహించారు.
 
3/6
చలికాలం ముందే వచ్చిందా అన్నట్లుగా మంగళవారం తెల్లవారుజామున మంచు దుప్పటి కనువిందు చేసింది. కొండలు ప్రకృతి రమణీయతను సంతరించుకున్నాయి. యాదగిరిగుట్ట నుంచి భువనగిరికి వెళ్లే మార్గంలో రాయగిరి వద్ద ఉన్న మల్లన్న గుట్ట పొగమంచుతో నిండిపోయింది. రహదారిపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో ప్రయాణికులు, వాహనచోదకులు తన్మయం చెందారు.  

4/6
విజయనగరం: వందలాది మంది భక్తుల నామస్మరణ నడుమ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం కనులపండువగా సాగింది. పెద్దచెరువు పశ్చిమ భాగాన ఉన్న గాఢీఖానా ఒడ్డుకు చేరుకుని, ఉత్సవ విగ్రహాన్ని హంస వాహనంలో కొలువుదీర్చారు. 

5/6
శ్రీకాళహస్తి మండలం జీకే పల్లి చెరువులో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలుచేపట్టారు. మధ్యలో చెట్టు చుట్టూ ఉన్న మట్టిని వదిలేయడంతో వృక్షమొక్కటే తవ్వకాలకు సాక్ష్యంగా నిలిచింది. 
 
6/6
వేళచ్చేరి, తమిళనాడు: సురక్షిత దీపావళిని జరుపుకొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళవారం చెన్నై చెంబియం కేఆర్కే పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది  

Published : 15 Oct 2025 06:19 IST

మరిన్ని

సుఖీభవ

చదువు