News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (16-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 16 Oct 2025 06:01 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/7
 సిద్దిపేట: అడపాదడపా వర్షం.. మధ్యాహ్నం ఎండ.. తెల్లవారుజామున, సాయంత్రం పూట మంచు దుప్పటి కప్పిన ఆకాశం... ఇదీ కొత్త సీజన్‌ రాకను ప్రతిబింబిస్తూ సిద్దిపేట పట్టణంలో జనాలను ఒక్కరోజులోనే ఆకట్టుకుంటున్న వాతావరణ పరిస్థితులు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుపై వేలాడే వంతెనను తెలిమంచు ఇలా కమ్మేసింది. 
 
2/7
పై చిత్రాన్ని గమనించండి. చుట్టూ ప్లాస్టిక్‌ వ్యర్థాలు, నడుమ వికసించిన కలువ పువ్వు చూపరులకు కనువిందు చేస్తుంది. పానగల్‌ చెరువు నీటిని విడుదల చేసే గేట్ల కింద నిలువ నీటిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకోగా వాటి నడుమ పూసిన గులాబీ రంగు కలువ ఆ దారిన వెళ్లే వారిని చూడగానే ఆకట్టుకుంటుంది. 

3/7
విశాఖపట్నం: నగరంలో ట్రాఫిక్‌ ఇక్కట్లు అన్నీఇన్నీ కాదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. బుధవారం రాత్రి ఎండాడ కూడలి వద్ద జాతీయ రహదారిపై రద్దీని చిత్రంలో చూడొచ్చు. 
 
4/7
 మద్దిలపాలెం: జీఎస్‌టీ తగ్గింపు  ప్రయోజనాలపై ఆర్కేబీచ్‌ రోడ్డులో  బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీచ్‌లో తీర్చిదిద్దిన సైకత శిల్పం సందర్శకులను ఆకట్టుకుంది.  

5/7
పూసపాటిరేగ మండలంలో చింతపల్లి సముద్రతీరంలో జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంది. ప్రజలకు అర్థమయ్యేలా జీఎస్టీపై వివరించేందుకు ఎంపీడీవో రాధిక ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కళాకారుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన హరి తీరంలో ప్రత్యేకంగా సైకత శిల్పం రూపొందించి ప్రదర్శించారు. 
 
6/7
పచ్చదనం పరచుకున్న కొండలు.. వాటిని తాకుతూ వెళ్లే మేఘాలు.. కనుచూపుమేర నీరు.. ఇటు మైదానం.. అటు మన్యం మధ్యలో అందాలతో అలరారుతోంది గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయం. బొర్రా గుహలు, అరకుకు ఈ ప్రాంతం ముఖద్వారం లాంటిది. దీంతో పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు.  

7/7
ఆ దారిలో వెళితే తెల్లని కాంతులు కనిపిస్తాయి.. రాత్రి వేళ చల్లని గాలి తాకుతుంది.. వర్షమొచ్చేముందు అటుఇటు ఊగుతా ఆహ్లాదాన్ని పంచుతాయి.. ఇరువైపులా ఉంటూ వచ్చి, వెళ్లేవారిలో ఆనందాన్ని నింపుతున్నాయి కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మీపురం, కోనవలస గ్రామాల రహదారులు. దీనికి కారణం అక్కడ పెద్దఎత్తున పెరిగిన రెల్లు గడ్డి. 

Published : 16 Oct 2025 05:34 IST

మరిన్ని

సుఖీభవ

చదువు