News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (19-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 19 Oct 2025 06:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
దీపావళిని పురస్కరించుకొని దేశరాజధానిలోని ఇండియా గేట్‌ సమీపంలో శనివారం దిల్లీ ప్రభుత్వం నిర్వహించిన డ్రోన్‌ షో. రాముడు బాణం సంధిస్తున్నట్లు డ్రోన్లతో ఆవిష్కరించిన దృశ్యాలు వీక్షకులను ఆకర్షించాయి.  

2/6
గూగుల్‌ విశాఖకు రానుండటంతో ప్రపంచవ్యాప్తంగా నగర ఖ్యాతి విస్తరించనుంది. ఇప్పటికే పలు ప్రముఖ ఐటీ సంస్థలు తమ కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు చేశాయి. మరికొన్ని విశాఖ వచ్చేందుకు వరుసలో ఉన్నాయి. సాగర తీరంలో రుషికొండ సమీప ఐటీహిల్స్‌ వైపు వెళ్లిన ప్రతి ఒక్కరిని అక్కడి భవంతులు, నిర్మాణాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.  

3/6
గోదావరికి దీపావళి ముందే వచ్చినట్లు ఉంది కదూ ఈ చిత్రం చూస్తుంటే.. రాజమహేంద్రవరం - కొవ్వూరు నడుమ నదిపైనున్న గామన్‌ వంతెన శనివారం రాత్రి విద్యుద్దీపాలతో కాంతులీనుతూ కనిపించింది.      

4/6
జమ్మలమడుగు: రాక్‌ ఆన్‌ బ్రో అంది సెలవు రోజు.. గడిపేద్దాం లైఫ్‌ కింగ్‌ సైజు.. ఒకే గదిలో ఉక్కపోత చాలు.. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి.. అంటూ యువత ప్రయాణానికి సై అంటోంది. ఉరుకుల పరుగుల జీవితం నుంచి బయటికి వచ్చి ద్విచక్ర వాహనాలపై దూరాలు పయనిస్తోంది. ఇటువంటి సాహస ప్రియులకు జమ్మలమడుగులోని చారిత్రాత్మక గండికోట స్వర్గధామంగా మారింది. 

5/6
అసలే పిల్లలు. ఆపై అల్లరి బుడుగులు.. ఒకచోట కుదురుగా ఉండరు. పైగా కాళ్లకు చక్రాలు.. రయ్‌మంటూ దూసుకుపోతూ సందడి చేశారు. కడప నగరంలోని వైవీయూ, డీఎస్‌ఏలో శనివారం నిర్వహించిన రింగ్‌ స్కేటింగ్‌ ఎంపికల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపునకు పోటీ పడ్డారు.   

6/6
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో   నిర్వహించిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి సాంస్కృతిక కళా ఉత్సవ్‌ ఆకట్టుకుంది. ఎల్లారెడ్డిపేట ఆదర్శ గురుకుల విద్యార్థిని అఖిలాండేశ్వరి  శివ తాండవం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 

Published : 19 Oct 2025 06:15 IST

మరిన్ని

సుఖీభవ

చదువు