News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (20-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 20 Oct 2025 05:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉన్న నియంత్రణ రేఖ వద్ద ఆదివారం దీపావళి వేడుకల్లో పాల్గొన్న సైనికులు 

2/6
ఆదివారం రాత్రి కోకాపేట గోల్డెన్‌ మైల్‌ రోడ్‌లోని 236 మీటర్ల ఎత్తయిన నివాస భవనం సాస్‌ క్రౌన్‌ నుంచి విరజిమ్మిన తారాజువ్వలు మిరుమిట్లు గొలుపుతూ నక్షత్రాలతో పోటీపడ్డాయి. 
 
3/6
విశాఖపట్నం: దీపావళిని కాస్త భిన్నంగా నిర్వహించుకోవాలనుకునే వారి కోసం ఆ తరహా సామగ్రి సిద్ధంగా ఉంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నవవే.  చూసేందుకు మిఠాయిల్లా ఉన్నా వాస్తవానికి ఇవి దీపాలు. ప్రత్యేక ఆకృతిలో తయారు చేసిన వీటికి ఒత్తులు జత చేశారు. దీపావళి పండగ రోజు వెలుగులు విరజిమ్మేందుకు అనువుగా రూపొందించారు.  
 
4/6
చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు దీపావళి సంబరాలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి పూలతో అలంకరించి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి పూజలు చేశారు. విద్యార్థులు టపాసులు కాల్చి సందడి చేశారు. 

5/6
వెలుగుల పండగ దీపావళి అంటేనే సందడి. ఈ పర్వదినంలో ముందుగా గుర్తొచ్చేవి టపాసులు, మతాబులు, కాకర పువ్వొత్తులు. ప్రతి ఇల్లు దీప, విద్యుత్తు కాంతులతో కళకళలాడుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం ఎంతో ఇష్టపడతారు. నేడు పండగను ఘనంగా జరుపుకోవడానికి జిల్లా వాసులు సిద్ధమయ్యారు. ఇప్పఇకే పలు విద్యాలయాల్లో ముందస్తు వేడుకలు సైతం నిర్వహించారు.  

6/6
 తిరుపతి-మదనపల్ల్లె మార్గంలో కీలకమైన భాకరాపేట కనుమకు మోక్షం లభించింది. దారి మొత్తం సేఫ్టీ       రెయిలింగ్, మలుపుల వద్ద మిర్రర్‌ స్టాండ్, సోలార్‌ సిగ్నల్‌ లైట్లు, రేడియం స్టిక్కర్లున్న సూచికలను ఏర్పాటు  చేసి  రోడ్డు ప్రమాదాలు జరగకుండా విస్తృత చర్యలు తీసుకున్నారు. 

Published : 20 Oct 2025 05:10 IST

మరిన్ని

సుఖీభవ

చదువు