- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/7
                        
                        కార్తిక మాసం ప్రారంభమైంది. శివాలయాల్లో బుధవారం భక్తులు ప్రత్యేక పూజలకు శ్రీకారం చుట్టారు. ఆలయాల్లో పారాయణాలు, భజనలు చేశారు. వేప, మామిడి, మారేడు, తులసి, రావి, జువ్వి, శమీ, కదంబ తదితర పవిత్ర వృక్షారాధనలు చేశారు. మహేశ్వరంలోని శివగంగరాజరాజేశ్వరస్వామి మందిరాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. 
                    2/7
                        
                        అందమైన ప్రకృతిలో జీవించే సీతాకోక చిలుకలు కనిపిస్తే ఆసక్తిగా తిలకిస్తుంటాం. వరంగల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని నాయుడు పెట్రోల్ పంపు కూడలిని ‘కుడా’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇక్కడ ఇనుప లోహపు చువ్వలపై సీతాకోక చిలుకల ఆకృతులను తయారు చేయించి రంగులు అద్దారు. కూడలిలో అవి గుంపుగా వాలినట్లు  అటువైపుగా వెళ్లే వారందరికీ కనువిందు చేస్తున్నాయి.  
                    3/7
                        
                         వెంకటాపూర్: నృత్య భంగిమలు.. పొన్నచెట్టుపై శ్రీకృష్ణుడు మురళీ స్వరాలను వాయిస్తున్నట్ల్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలకు ఓ ప్రత్యేకత ఉంది. మ్యూజిక్ పిల్లర్‌గా పిలువబడే రాతి స్తంభంలో శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నట్లు కనిపిస్తున్న చెట్టు మొదలుపై  మీటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. క్రీ.శ.1,213 సంవత్సరంలో కాకతీయులు రామప్ప ఆలయం నిర్మించారు. 
                    4/7
                        
                        ఒంగోలు: తథాగతుడు ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్లు... ఆయనకు నిద్రాభంగం కలగకుండా మేఘాలు రక్షణ కవచంలా నిలిచినట్లు... చూడగానే మదిదోచేలా ఉంది కదూ ఈ చిత్రం. దొనకొండ మార్గంలో పొదిలి వైపుగా ఉన్న పృథుల గిరులు ఇలా దర్శనమిస్తూ అటుగా వెళ్లేవారిని కనువిందు చేస్తున్నాయి. 
                    5/7
                        
                        శివపార్వతుల రూపాల్లోని బొమ్మలను చూశారా.. ఇందులో ఓ వైవిధ్యం దాగుంది. తదేకంగా చూస్తే బొమ్మల మధ్యలో శివ, పార్వతుల స్తోత్రాలు సూక్ష్మంగా రాసి ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు వీటిని అందంగా రూపొందించి ఫొటోఫ్రేమ్‌లు కట్టి భీమవరం మండలం యనమదుర్రులోని శ్రీశక్తీశ్వరాలయంలో అమర్చారు.  
                    6/7
                        
                        ఈ చిత్రాన్ని చూస్తుంటే అమెరికాలో టోర్నడోలా ఉంది కదూ. కాదండీ.. కారుమేఘాలు కమ్ముకుని కొండలపై వర్షం కురుస్తున్న సమయంలో తీసినది. బెల్లంకొండ మండలం పాపాయపాలెం కొండల వద్ద ఈ సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. 
                    7/7
                        
                        ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దున జోలాపుట్టు జలాశయం పరిధిలో విస్తరించి ఉన్న మత్స్యగెడ్డ నిండు గోదావరిలా దర్శనమిస్తోంది. అధిక వర్షాలకు వాగులు, గెడ్డల నుంచి వచ్చే వరదనీరు మత్స్యగెడ్డలో చేరి నదిని తలపిస్తోంది. పచ్చని కొండల మధ్య విస్తరించి ఉన్న గెడ్డ పరివాహక ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 23 Oct 2025 05:46 IST	
	  
    మరిన్ని
- 
                    
                            ఆకట్టుకున్న వెజిటబుల్స్ ప్రదర్శన - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
 - 
                        
                            

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. అపరెల్ గ్రూప్‌ను ఆహ్వానించిన మంత్రి నారాయణ
 - 
                        
                            

కొలికపూడి, కేశినేని పంచాయితీ.. క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
 - 
                        
                            

యువత ‘రీల్స్’లో బిజీగా ఉండాలని మోదీ కోరుకుంటున్నారు: రాహుల్
 - 
                        
                            

కార్తిక పౌర్ణమి విశిష్టత.. జ్వాలా తోరణం వెనుక పురాణ గాథలు తెలుసా?
 - 
                        
                            

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
 


