News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 24 Oct 2025 06:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/7
చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారు గురువారం ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. దీపావళి నుంచి నిత్యం విశేష పూజలు నిర్వహిస్తుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. 

2/7
మహబూబ్‌నగర్‌: ఈ చిత్రం చూస్తుంటే భూమి, ఆకాశం కలిసినట్లు కనిపిస్తోంది కదూ. కారు మబ్బులు పట్టి వరుణుడు కురిసేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం జలాశయం వద్ద తీసిన చిత్రమిది. 

3/7
గుత్తులు గుత్తులుగా ఉన్న ఈ పుష్పాలు చాలా మెత్తగా ఉంటాయి. ‘అకాలిఫా హిస్పిడా’ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ‘అలంకరణకు ఎంతో చక్కగా ఉంటాయి. పిల్లి తోక ఎలా మెత్తగా ఉంటుందో అలా ఉంటాయి. సుమారు అడుగున్నర పొడవు పెరుగుతాయి. ఎక్కువగా ఇండియా, చైనా, ఫిలిప్పీన్స్‌లో పెరుగుతాయి’ అని జీవవైవిధ్య ఉద్యానవన నిర్వాహకులు డాక్టర్‌ రామ్మూర్తి తెలిపారు.  

4/7
పచ్చని ప్రకృతి నడుమ పాములా మెలికలు తిరిగిన 16వ నంబరు జాతీయ రహదారి ఇది. విశాఖపట్నం- శ్రీకాకుళం మార్గాన్ని ఆనందపురం కొండపైనుంచి చూస్తే ఇంతందంగా కనిపిస్తుంది. గతంలో ఇదే రహదారి నాలుగు వరుసలుగా ఉండేది. ఆరు వరుసలుగా అభివృద్ధి చేశాక విశాఖ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరింత మెరుగయింది. 

5/7
పేరుకి మాత్రమే చిన్నది కానీ దాని బుర్ర ఎంత పెద్దదో చూడండి. గూడు కట్టుకోవడానికి పాములు, ఇతర జీవులు పైకి వచ్చేందుకు సాహసం చేయని ముళ్లు ఉన్న తుమ్మచెట్టు ఎంచుకుంది. బలమైన కొమ్మలపై కాకుండా ఇలా గాలికి సైతం ఊగిపోయే చిటారు కొమ్మన ఒక మిఠాయి పొట్లంలా అందమైన గూడు కడుతోంది. 

6/7
ఏమిటీ? అడవిలో ఉండాల్సిన జిరాఫీని భలేగా టాటా ఏస్‌లో తరలిస్తున్నారే.. అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. ఎందుకంటే, ఇది నిజమైన వన్యప్రాణి కాదు. అదొక బొమ్మ. ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించే వన్యప్రాణుల బొమ్మలను నిజామాబాద్‌ నుంచి బాన్సువాడ వైపు వాహనంలో తరలిస్తుండగా గురువారం మధ్యాహ్నం ఈ చిత్రాన్ని ‘ఈనాడు’ క్లిక్‌మనిపించింది.  
 
7/7
పెంచికల్‌పేట్‌ మండలంలోని అటవీ ప్రాంతాల్లో పచ్చని గుట్టలు, సెలయేళ్లు, పక్షుల కిలకిలరావాలతో కూడి.. ప్రకృతి సౌందర్యాన్ని మరింత అందంగా మార్చుతున్నాయని పక్షి ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఇండియన్‌ గోల్డెన్, ఓరియల్, పెన్‌టెడ్‌ స్టార్క్, బ్రాహ్మిణి స్టార్లింగ్, రోస్‌రింగ్డ్, ఫ్యాటిక్, సన్‌బర్డ్, స్కేలి-బ్రెస్టెడ్‌ యూనియా, ఇండియన్‌ గ్రేహర్న్‌బిల్, రెడ్‌వాటిల్డ్, ల్యాప్వింగ్, యూరేసిషన్‌ కాలర్డ్‌డోవ్, గ్రీన్‌బీ ఈటర్, ఫుటెడ్‌ గ్రీన్‌ పిజన్, కింగ్‌వెంట్‌డ్‌ బల్బుల్‌ వంటి పక్షులు తరచుగా దర్శనమిస్తున్నాయి. 

Published : 24 Oct 2025 06:32 IST

మరిన్ని

సుఖీభవ

చదువు