News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 26 Oct 2025 06:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
చూడ్డానికి లింగాకారంలో కనిపిస్తున్న కొండ హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం నారాయణగిరి గ్రామ శివారులో ఉంది. ఈ గుటల్లో దిగువన నరసింహస్వామి కొలువై ఉన్నాడు. నారాయణుడు వెలసిన గ్రామంగా ఊరికి నారాయణగిరి అని పేరొచ్చినట్లు పెద్దలు చెబుతున్నారు. 

2/6
రోలుగుంట, రావికమతం మండలాల్లోని పలు గ్రామాలను ఉదయం వేళ దట్టంగా పొగమంచు కప్పేస్తోంది. నర్సీపట్నం - చోడవరం ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. వాహనదారులు బారెడు పొద్దెక్కినా లైట్లు వేసుకుని మరీ పయనించాల్సి వస్తోంది. 

3/6
హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఖైరతాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి జన్మదినం సందర్భంగా ఆమె అభిమాని హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త మహ్మద్‌ గౌస్‌ తన మిత్రబృందంతో కలిసి శనివారం బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో సైకత శిల్పాన్ని వేయించారు. దానిని సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.  

4/6
ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, మరెన్నో అద్భుతాలు. కాలానుగుణంగా తనను తాను మార్చుకుంటూ ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తుంది. చిత్రంలో కనిపిస్తోంది అలాంటిదే. వర్షాకాలంలో కనిపించే పుట్టగొడుగులు కనువిందు చేస్తున్నాయి. యర్రగొండపాలెంలో రహదారి పక్కన కనిపించిన ఈ పుట్టగొడుగులు తినేందుకు పనికి రాకపోయినా తమ ఆకారంతో ఇలా ఆకట్టుకుంటున్నాయి. 

5/6
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు శేషాచల కొండల్లోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఎత్తయిన ప్రాంతం నుంచి కిందికి జాలువారుతూ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.  స్థానికులతో పాటు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. 

6/6
 మన పార్లమెంటు తరహాలో, అమెరికాలో ప్రజాప్రతినిధుల సమావేశాలను నిర్వహించేందుకు పార్లమెంటు భవనం (క్యాపిటల్‌ హౌస్‌) ఉంది. అది ఎలా ఉంటుందో చూసేందుకు, అవకాశం అందరికీ వస్తుందా, ఆ.. ‘మాకేం తెలుసు యూట్యూబులో చూడటమేగా’ అంటారా.. అయితే నిజంగా చూడాలని ఉంటే, ఒకసారి మైలవరం రావాల్సిందే. 

Published : 26 Oct 2025 06:20 IST

మరిన్ని

సుఖీభవ

చదువు