News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 27 Oct 2025 05:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
పాడేరు ఘాట్‌రోడ్డులోని పోతురాజు గుడి సమీపంలో మంచు పొరలను చీల్చుకుంటూ భూమిని తాకిన సూర్యకిరణాలు వీక్షకులకు కనువిందు చేశాయి. ప్రస్తుతం మన్యంలో ఉదయం వేళలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఇక్కడి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. 

2/6
కార్తికమాసం సందర్భంగా యలమంచిలి విష్ణాలయం వద్ద ప్రత్యేకంగా కొలను ఏర్పాటు చేసి శివలింగాన్ని కొలువుదీర్చారు. శివయ్యకు నిరంతరం అభిషేకం జరిగేలా మోటారు, పంపు ద్వారా నీటి ధారలు పడేలా ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛమైన నీరు, తామరాకులతో ఉన్న కొలనులో నేత్రపర్వంగా ఉన్న శివలింగాన్ని, అభిషేక దృశ్యాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
 
3/6
అర్థవీడు: అపార జలరాశి... ఆ మధ్యన నిలువెత్తు కొండలు... వాటిపై విహరిస్తున్న మేఘమాల... చూస్తుంటే ఇదేదో హిమాలయాల్లోని మానస సరోవరమో లేదంటే గోదావరిలోని పాపికొండల మార్గమో అని భావిస్తే మీరు పొరబడినట్లే. ఆసియాలోనే రెండో అతి పెద్ద మానవ నిర్మితమైన కంభం చెరువు సోయగమిది. ఇటీవలి వర్షాలకు నిండుకుండలా మారి ఇలా కనువిందు చేస్తోంది.
 
4/6
నల్లమలలో అత్యంత ఎత్తయిన పాలకం జలపాతమిది. దాదాపు 400 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతోంది. ఈ అందం చూడాలంటే... యర్రగొండపాలెం మండలంలోని పాలుట్లకు వెళ్లాలి. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో పాలనురగను తలపిస్తూ... దిగువనే కొలువుదీరిన పాలంక వీరభద్రుడిని అభిషేకిస్తున్నట్లు హొయలుపోతోంది.
 
5/6
చీకట్లను చీల్చుకుంటూ.. సూర్యుడు ఉదయిస్తున్న సమయం.. గిరులచాటు నుంచి రవి కాంతులు నీలాకాశంపై రంగులను వెదజల్లుతున్నట్లు.. ప్రకృతి ప్రేమికుల హృదయాలను రంజింపచేసిన ఈ వర్ణోదయాన్ని ఆదివారం ఉదయం గూడెంకొత్తవీధి మండలం రింతాడ సమీపంలో ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. 

6/6
కొండ ప్రాంతాలకే పరిమితమైన పవన విద్యుత్తును ఇప్పుడు నగరంలో సోలార్‌ హైమాస్ట్‌ లైట్లకు అమర్చారు. పగలు సౌర పలకలతో.. రాత్రివేళ గాలితో ఛార్జింగై దీపాలు వెలుగుతాయి. గచ్చిబౌలి కూడలిలో ఏర్పాటు చేశారు.  

Published : 27 Oct 2025 05:20 IST

మరిన్ని

సుఖీభవ

చదువు