- TRENDING
 - Montha Cyclone
 - IND vs AUS
 
News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
1/11
                        
                         మన్యంలో ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయినా ప్రయాణికుల్లో, వాహన చోదకుల్లో మార్పు కానరావడం లేదు. ఆటోలు, జీపులపై వేలాడుతూ వెళుతున్నారు. మన్యంలో తగినన్ని రవాణా సదుపాయాలు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. చింతపల్లి- గూడెంకొత్తవీధి మార్గంలో సోమవారం ఆటోపై వేలాడుతున్న ప్రయాణికులను చిత్రంలో చూడొచ్చు. 
                    2/11
                        
                        పొట్టదశలో ఉన్న వరి ధాన్యాన్ని ఆరగించేందుకు పక్షులు చేలల్లో బారులు తీరుతున్నాయి. గాలిలో గింగిరాలు కొడుతూ, కడుపు నిండా వరి గింజలు ఆరగిస్తూ విద్యుత్ తీగలపై గుంపులుగా సేదతీరుతున్నాయి. ఆ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలో ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన దృశ్యం ఇది
                    3/11
                        
                         పారా అథ్లెట్, ‘ఈనాడు లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి చిత్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ పిల్లర్‌పై పెయింటింగ్ వేయించారు. పరుగు తీస్తున్నట్లు ఉన్న దీప్తి చిత్రం యువతకు స్ఫూర్తిగా ఉండేలా తీర్చిదిద్దారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవాంజి దీప్తి పారిస్ పారాలింపిక్స్‌లో టీ-20 400 మీటర్ల పరుగులో కాంస్య పతకం, ఇటీవల ఆస్ట్రేలియాలో ‘విర్టుస్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2025’లో టీ-20 400, 200 మీటర్ల పరుగు విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించారు.
                    4/11
                        
                          కార్తిక మాసోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీభద్రేశ్వర స్వామికి లక్ష పుష్పార్చన జరిపారు. అంతకుముందు ఉదయం శివునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చనలు నిర్వహించారు. కార్తిక దీపోత్సవం సందర్భంగా రాత్రి భద్రకాళి ఆలయంలో మహిళలు దీపాలు వెలిగించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశానుసారం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈవో సునీత, ధర్మకర్త వీరన్న, శ్రీలక్ష్మి శ్రీనివాస సేవా ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
                    5/11
                        
                        హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వర వేయిస్తంభాల దేవాలయంలో కార్తిక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా మొదటి సోమవారం రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు మణికంఠశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు రుద్రేశ్వరుడిని నీలకంఠుడిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయంలో మహిళా భక్తులకు దీపం ప్రమిదలు, వత్తులు, నూనె అందించారు.
                    6/11
                        
                        
                    7/11
                        
                          పాప్ సాంగ్స్.. సినిమా గెటప్‌లతో కాకతీయ వైద్య కళాశాల(కేఎంసీ) వార్షికోత్సవం ఉత్కర్ష-25లో వైద్య విద్యార్థులు సందడి చేశారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన కార్నివాల్ నైట్‌లో సినిమా గెటప్‌లు, సైనికుడు, కార్టూన్ పాత్రలు, పిట్టల దొరలాంటి విచిత్ర వేషధారణలతో ఆకట్టుకున్నారు. పాప్ పాటలు, సినీ గీతాలతో బ్యాండ్ మోత మోగించగా.. సహ విద్యార్థులు నృత్యాలతో అలరించారు. ఫుడ్ ఫెస్టివల్ నోరూరించింది. ఉత్తమ వంటకాలు చేసిన విద్యార్థులకు లక్కీ డ్రా తీసి బహుమతులు అందించారు.
                    8/11
                        
                         సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండీ పైవంతెన రెయిలింగ్‌కు మొక్కలు మొలిచాయి. అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వాటిని మొక్కల దశలోనే తొలగించకుంటే వృక్షాలుగా ఎదిగి పైవంతెన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది.
                    9/11
                        
                         నగరంలో ఒంగోలు గిత్త సంచరిస్తున్నట్లుంది కదా.. కానీ ఇది నిజం కాదు. దీపావళి సందర్భంగా నిర్వహించిన సదర్ ఉత్సవాల కోసం ర్యాలీలో ప్రదర్శించడానికి నిర్వాహకులు తీసుకొచ్చిన ఆకృతి ఇది. ఉత్సవాల అనంతరం కాచిగూడ చాపెల్ బజార్‌లో దీన్ని ఉంచడంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆగి మరీ దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు.
 
                    10/11
                        
                        
                    11/11
                        
                         నగరంలోని ఉత్తరాది ప్రజలు సోమవారం ఛఠ్‌పూజ పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వేళ టాం్యక్‌బండ్‌కు పెద్దఎత్తున తరలివచ్చిన ఉత్తరాదివాసులు సూర్యభగవానుడిని ఆరాధిస్తూ పండ్లు, ప్రసాదాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 
                    
                Tags : 
                
            
            
                
	
	
	  Published : 28 Oct 2025 07:10 IST	
	  
    మరిన్ని
- 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (04-11-2025) - 
                    
                            ఘోర రోడ్డు ప్రమాదం.. హృదయ విదారక చిత్రాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (03-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (02-11-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (01-11-2025) - 
                    
                            సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి.. నివాళులర్పించిన మోదీ - 
                    
                            పీపుల్స్ ప్లాజాలో ‘రన్ ఫర్ యూనిటీ’లో పాల్గొన్న చిరంజీవి - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025) - 
                    
                            తెలంగాణలోని పలు జిల్లాల్లో ‘మొంథా తుపాను’ బీభత్సం - 
                    
                            మొంథా తుపాను ఎఫెక్ట్.. జలదిగ్బంధంలో ఓరుగల్లు - 
                    
                            ఏపీలో మొంథా ప్రభావం.. పలు ప్రాంతాలు జలమయం - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025) - 
                    
                            తెలంగాణలో వర్షాలు..జలమయమైన రహదారులు - 
                    
                            ఒంగోలు జలదిగ్బంధం.. జనజీవనం అస్తవ్యస్తం - 
                    
                            కృష్ణా, గుంటూరులో మొంథా ఉప్పెన - 
                    
                            మొంథా బీభత్సం.. పలు చోట్ల కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025) - 
                    
                            మొంథా ఎఫెక్ట్: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు చోట్ల కూలిన చెట్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (28-10-2025) - 
                    
                            విశాఖలో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (27-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (26-10-2025) - 
                    
                            విశాఖలో మాయా ప్రపంచం! - 
                    
                            కర్నూలులో ఘోరం.. బస్సు ప్రమాద దృశ్యాలు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (24-10-2025) - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (23-10-2025) - 
                    
                            ఒంగోలులో భారీ వర్షాలు.. జలమయమైన రోడ్లు - 
                    
                            చిత్రం చెప్పే విశేషాలు (22-10-2025) - 
                    
                            తెలంగాణ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం - 
                    
                            ఏపీ వ్యాప్తంగా అమరవీరుల సంస్మరణ కార్యక్రమం 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 


