News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (29-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 29 Oct 2025 06:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
మనిషిలో చెట్టు ఎలా పెరిగింది, దానిని ఎలా ఆలింగనం చేసుకున్నాడా.. అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇక్కడ కనిపిస్తున్నది మనిషి బొమ్మ. వరంగల్‌ నగర సుందరీకరణలో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన నిర్మాణాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హనుమకొండ కాళోజీ కూడలి వద్ద కనిపించే ఈ దృశ్యం వాహనదారులు, నగరవాసులను నిత్యం ఆకర్షిస్తోంది. 
 
2/6
మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో.. 
మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో.. 
3/6
హుబ్బళ్లిలోని ప్రఖ్యాత ఉంకల్‌ సరస్సు ఎప్పటికప్పుడు తన అందాలతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. మంగళవారం పైన తేలియాడే వెండిమబ్బులు.. కింద ఆవరించి ఉన్న జలంతో చూపరులను పరవశుల్ని చేసింది. 

4/6
దొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంలో వలస విహంగాల సందడి నెలకొంది. వర్షాలకు నేలపట్టు చెరువు జలకళ సంతరించుకుంది. విహంగాలు చెరువులోని కడప చెట్లపైకి చేరి గూళ్లు కట్టుకుంటున్నాయి. వీటిని వీక్షించేందుకు చెరువు కట్టపై వ్యూ పాయింట్లను అధికారులు సిద్ధం చేశారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రం, సందర్శనశాల, ఫిల్మ్‌షో కేంద్రాలను సుందరంగా తీర్చిదిద్దారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించారు. 

5/6
తిరుపతి ప్రధాన రైల్వేస్టేషన్‌ నుంచి రేణిగుంటకు వెళ్లే మార్గంలో రైల్వే ట్రాక్‌ యు ఆకారంలో ఆకట్టుకుంటోంది. ఇక్కడ పట్టాలపై రైళ్లను ఈ మార్గంలో వెళ్లే ప్రజలు, శ్రీవారి భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

6/6
సాగర తీరంలోని విశాఖ నగరంపై ‘మొంథా’ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భీకర గాలులకు పెద్ద సంఖ్యలో చెట్లు పడిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.కమ్ముకొస్తున్న నల్లని మేఘాలను సింహాచలం కొండపైనుంచి భక్తులు ఆసక్తిగా తిలకించారు. 

Published : 29 Oct 2025 05:56 IST

మరిన్ని

సుఖీభవ

చదువు