News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (30-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 30 Oct 2025 05:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/6
మొంథా తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై ఉండటాన్ని చూసిన జనానికి మారిన వాతావరణానికి సంకేతంగా బుధవారం ఉషోదయం విభిన్నంగా కన్పించింది. లేలేత కిరణాలు వెలుగులు విరజిమ్మక ముందే ఆకాశం ఎర్రగా మారి స్థానికులకు వింత అనుభూతిని మిగిల్చింది. బి.కొత్తకోట పట్టణంలో కనిపించిన ఈ దృశ్యాన్ని స్థానికులు చరవాణుల్లో బంధించారు. 

2/6
రామగిరి మండలం ఎన్‌ఎస్‌ గేటు వద్ద రైల్వే ట్రాక్‌ కిందనున్న కంకరను తొలగించి కొత్తవి వేస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా కంకర రవాణాకు ట్రాక్టర్‌ను వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌కు  రైలు చక్రాలు అమర్చి నడిపిస్తున్నారు. దీన్ని అటుగా వెళుతున్నవారు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు.   

3/6
కార్తిక మాసం సందర్భంగా నిడమర్రు మండలం మందలపర్రులోని ఉమా నీలకంఠేశ్వరస్వామికి బుధవారం విశేషాలంకరణ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి సుందర రూపాన్ని తిలకించి తరించారు.
 
4/6
భారీ వర్షాలకు మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతానికి వరద పెరిగింది. 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. దిగువన రంగనాథస్వామి ఆలయం వద్దకు వరద నీరు చేరింది.  

5/6
సంతకవిటి మండలం సిరిపురం గ్రామంలో 800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తామర చెరువు తుపాను వర్షాలకు పూర్తిస్థాయిలో నిండింది. మిగులు జలాలు చప్టాపై నుంచి జాలువారి పడే దృశ్యం జలపాతాన్ని తలపించింది. స్థానికంగా ఉండే చిన్నారులు బుధవారం అక్కడ కేరింతలు కొట్టారు.  

6/6
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మోయతుమ్మెద వాగు మధ్యలో తుంగ విపరీతంగా పెరిగింది. మొక్కలకు తెల్లని పూలు పూశాయి. సెప్టెంబరు నుంచి రెండు నెలల పాటు విస్తృతంగా ఇలా పూస్తాయి. 

Published : 30 Oct 2025 05:10 IST

మరిన్ని