News in Pics: చిత్రం చెప్పే విశేషాలు (31-10-2025)

నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..

Eenadu icon
By Photo News Team Updated : 31 Oct 2025 06:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/5
విశాఖ జిల్లాలోని గంభీరం జలాశయం పూర్తిగా నిండి జలకళతో ఆకట్టుకుంటోంది. చుట్టూ పచ్చని కొండలు... మధ్యలో వరద నీరు... జలాశయం నిండి అలుగు మీదుగా కిందికి దూకుతున్న జల సవ్వడులు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. నగర వాసులు పలువురు ఈ ప్రకృతి మనోహర దృశ్యాలను తిలకించేందుకు వెళుతున్నారు. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి సమీపంలో, ఆనందపురం దగ్గరలో ఈ జలవనరుంది. 

2/5
గొలుగొండ: ధారమల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని జలపాతంలో పరవళ్లు తొక్కుతోంది. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న కొండలపై నుంచి వరద పోటెత్తుతోంది. బండరాళ్లు నాచుపట్టి ఉండటం, నీటి ప్రవాహ ఉద్ధృతి అధికంగా ఉండటంతో స్నానాలకు ఎవరూ దిగవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  

3/5
నీటి విడుదల నేపథ్యంలో మాచ్‌ఖండ్‌ ప్రాజెక్టు వద్ద సుందర దృశ్యం

4/5
కార్తిక మాసం పురస్కరించుకుని వేలివెన్నులో కొలువైన పార్వతీ సమేత సోమేశ్వరస్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, విశేష పూజలు గురువారం నిర్వహించారు. సామూహిక దీపారాధన చేశారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. 

5/5
తమిళనాడు: నాగపట్నం జిల్లా వేదారణ్యం తాలూకా కొడియకరైలో పక్షుల శరణాలయం ఉంది. ఏటా ఈశాన్య రుతుపవనాలు ప్రారంభంలో అక్టోబరు నుంచి మార్చి వరకు రష్యా, ఇరాన్, ఇరాక్, శ్రీలంక తదితర దేశాల నుంచి 294కుపైగా రకాలైన పక్షులు వస్తుంటాయి. ప్రస్తుం ఇక్కడికి ఎర్రటి పాదాల బూబీ, టెర్న్, సీగల్, చారల బాతు తదితర రకాల పక్షులు వేలసంఖ్యలో తరలివచ్చాయి. 

Published : 31 Oct 2025 05:50 IST

మరిన్ని

సుఖీభవ

చదువు