IRCTC rules: రైల్వే రిజర్వేషన్‌ విధానంలో ఇటీవల వచ్చిన ఈ మార్పులు తెలుసా?

రైల్వే ప్రయాణికులకు సౌకర్యార్థం ఇటీవల రైల్వేశాఖ (Indian Railways) కొన్ని మార్పులు తీసుకొచ్చింది. టిక్కెట్ల జారీలో పారదర్శకత కోసం కొన్ని చర్యలు చేపట్టింది. ఆధార్‌ అథంటికేషన్‌, ఓటీపీ ఇందులో భాగమే. దీంతో పాటు అడ్వాన్స్ బుకింగ్‌ సమయాన్నీ తగ్గించింది. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులేంటో చూసేద్దామా?

Eenadu icon
By Photo News Team Updated : 08 Oct 2025 17:35 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/5
దూర ప్రాంతం వెళ్లే రైళ్లకు 8 గంటల ముందే ప్రయాణికుల చార్ట్‌ను రైల్వేశాఖ సిద్ధం చేస్తోంది. ఇంతకుముందు ఇది 4 గంటలుగా ఉండేది. ఒకవేళ టికెట్‌ కన్ఫామ్‌ కాకపోతే ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఈ మార్పు చేపట్టింది. మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల కంటే ముందు బయల్దేరే రైళ్లకు ముందురోజు రాత్రి 9 గంటలకు, 2 తర్వాత బయల్దేరే రైళ్లకు 8 గంటల ముందు టికెట్‌ వివరాలను ప్రయాణికులకు మెసేజ్‌ ద్వారా ప్రయాణికులకు పంపిస్తున్నారు. 

2/5
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో ఆధార్‌ అథంటికేషన్‌, కేవైసీ పూర్తి చేసిన వ్యక్తులు మాత్రమే జులై 1 నుంచి తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశాన్ని రైల్వే శాఖ తెచ్చింది. జులై 15 నుంచి ఆధార్‌ ఓటీపీని కూడా తప్పనిసరి చేసింది. తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్టవేసి నిజమైన ప్రయాణికులకు టికెట్లు దక్కేలా చూడడమే దీని లక్ష్యం.

3/5
తత్కాల్‌ కౌంటర్లు, ఆథరైజ్డ్‌ ఏజెంట్ల వద్ద తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌కు ఆధార్‌ ఓటీపీని జులై 15 నుంచి తప్పనిసరి చేసింది. ఏజెంట్లకు తొలి అరగంట పాటు తత్కాల్‌ రిజర్వేషన్‌ టికెట్ల బుకింగ్‌ సదుపాయాన్ని నిలిపివేసింది.

4/5
రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. తత్కాల్‌ టికెట్ల మాదిరిగానే సాధారణ రిజర్వేషన్‌ విధానానికీ ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి. అక్టోబర్‌ 1 నుంచి ఏ రైలుకైనా బుకింగ్‌ విండో ప్రారంభమైన తొలి పావు గంటలో ఆధార్‌ వెరిఫైడ్‌ ఖాతాలకే బుకింగ్‌ అవకాశం.

5/5
రిజర్వేషన్ టికెట్ల తేదీని ఆన్‌లైన్‌లోనే మార్చుకునే సౌకర్యాన్ని అందించేందుకు రైల్వే బోర్డు సిద్ధమవుతోంది. 2026 జనవరి నాటికి ఈ ఫీచర్‌ రావొచ్చు. ప్రస్తుతానికి ప్రయాణ తేదీ మార్చుకోవాలంటే టికెట్‌ రద్దు చేసుకుని కొత్తగా బుక్‌ చేసుకోవాలి. కొత్త విధానంలో ఉచితంగానే మార్చుకోవచ్చు. అయితే, ఇది టికెట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

Published : 08 Oct 2025 17:04 IST

మరిన్ని

సుఖీభవ

చదువు