APPSC: గ్రూప్‌ -2 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు నేటితో ముగియనుండటంతో ఆ గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు.

Updated : 10 Jan 2024 15:46 IST

APPSC Group 2 Applications | అమరావతి:  ఏపీలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు పొడిగించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు జనవరి 17 అర్ధరాత్రి 11.59గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.  గ్రూప్‌ 2 పోస్టులకు దరఖాస్తు చేసేటప్పుడు సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాటిని సరిచేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల గడువును మరో వారం రోజుల పాటు పొడిగించడం గమనార్హం.

రామంతాపూర్‌ హెచ్‌పీఎస్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..!

రాష్ట్రంలో మొత్తం 897 పోస్టుల భర్తీకి గ్రూప్-2 నోటిఫికేషన్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఇందులో 331  ఎగ్జిక్యూటివ్‌, 566 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.  డిసెంబర్‌ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్‌లో తెలపగా.. అభ్యర్థుల ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తుల గడువును జనవరి 17వరకు పొడిగిస్తూ నిర్ణయం ప్రకటించారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం https://psc.ap.gov.in/ క్లిక్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని