APSLPRB: ఎస్సై దేహదారుఢ్య పరీక్షలకు కాల్ లెటర్లు విడుదల

ఏపీలో ఎస్సై పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షల కాల్‌ లెటర్లు విడుదలయ్యాయి. ఆగస్టు 24 మధ్యాహ్నం 3గంటల వరకు వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated : 14 Aug 2023 17:03 IST

అమరావతి: ఏపీలో ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 25 నుంచి దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ) జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన కాల్‌ లెటర్లను పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను సమర్పించడం ద్వారా కాల్‌ లెటర్‌ పొందొచ్చు. ఆగస్టు 24 మధ్యాహ్నం 3గంటల వరకు కాల్‌ లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆ 20 యూనివర్సిటీలు ఫేక్‌.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవు!

విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు జరగనున్నాయి.  ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోసం ఒరిజినల్‌ ధ్రువపత్రాలతో పాటు స్టేజ్‌-2 ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ కాపీని సైతం సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 411 ఉద్యోగాలకు గానూ ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించగా.. 1,51,288 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. దేహదారుఢ్య పరీక్షలకు 56,116మంది ఎంపికయ్యారు.

కాల్‌ లెటర్‌ కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని