BARC Jobs:బార్క్‌లో 4,374 పోస్టులు.. పరీక్ష షెడ్యూల్‌, అడ్మిట్‌ కార్డులివిగో..!

బార్క్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. 

Published : 30 Oct 2023 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయిలోని బాబా అణువిద్యుత్తు పరిశోధనా కేంద్రం (బార్క్‌)లో 4,374 ఉద్యోగాల భర్తీకి నవంబర్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌ 18 నుంచి 24వరకు జరిగే ఈ పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. ఈ కార్డుల్ని బార్క్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో వుంచింది. బార్క్‌లో టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ లింక్‌ https://www.barc.gov.in/  క్లిక్‌ చేసి అడ్మిట్ కార్డులను పొందొచ్చు. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో బార్క్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఏప్రిల్‌ 24 నుంచి మే 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ విద్యార్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకున్నారు. పూర్తి వివరాలివే..

పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని