New Jobs: బార్క్‌లో భారీగా ఉద్యోగాలు.. వేతనం ఎంతో తెలుసా?

BARC Job Notification: బార్క్‌లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. పూర్తి వివరాలివే..

Published : 22 Apr 2023 16:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయిలోని  బాబా అణువిద్యుత్తు పరిశోధన కేంద్రం (బార్క్‌)లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 4,374  టెక్నికల్ ఆఫీసర్, స్టైపెండరీ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 24 నుంచి మే 22వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న కీలక అంశాలివే..

  • టెక్నికల్ ఆఫీసర్/ సి: 181 పోస్టులు; 2. సైంటిఫిక్ అసిస్టెంట్/ బి: 7 పోస్టులు; 3. టెక్నీషియన్/ బి: 24 పోస్టులు
  • ప్రారంభ వేతనం: నెలకు టీవో ఖాళీలకు రూ.56,100; ఎస్‌ఏకు రూ.35,400; టెక్నీషియన్ పోస్టులకు రూ.21,700 చొప్పున చెల్లిస్తారు.
  • ట్రైనింగ్‌ స్కీమ్‌ (స్టైపెండరీ ట్రైనీ) కింద మొత్తం 4162 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించగా.. వీటిలో కేటగిరీ-1లో 1216 పోస్టులు, కేటగిరీ-2లో 2946 పోస్టులుచొప్పున ఉన్నాయి. 
  • ఈ పోస్టులకు స్టైపెండ్: నెలకు కేటగిరీ-1కు రూ.24,000 నుంచి రూ.26,000; కేటగిరీ-2కు రూ.20,000 నుంచి రూ.22,000 వరకు చెల్లిస్తారు.
  • విభాగాలు: బయో-సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆర్కిటెక్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ, మైనింగ్ తదితరాలు.
  • అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయోపరిమితి (22.5.2023 నాటికి): టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35; సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-30; టెక్నీషియన్‌కు 18-25; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఎంపిక ప్రక్రియ: ఉద్యోగం అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు