CBSE Results: సీబీఎస్ 10, 12 తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి
CBSE Class 10 results: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. తొలుత ఉదయం 12వ తరగతి ఫలితాలు విడుదల చేసిన అధికారులు.. కొద్ది గంటల్లోనే 10వ తరగతి రిజల్ట్స్ ఇచ్చారు. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్ పొందొచ్చు. (CBSE 10, 12 Results Announced)
సీబీఎస్‌ఈ టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
సీబీఎస్‌ఈ 10వ తరగతి (CBSE Class 10) పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 21వ తేదీ వరకు జరిగాయి. ఈ పరీక్షలకు 21లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 93.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది (94.40శాతం)తో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత 1.28శాతం తగ్గింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, బెంగళూరులో 99.18శాతం, చెన్నైలో 99.14శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,95,799 మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 44,297 మంది 95శాతం కంటే ఎక్కువ స్కోరు సాధించినట్లు బోర్డు తెలిపింది.
CBSE 12వ తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థుల మధ్య అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు 12వ తరగతి మాదిరిగానే 10వ తరగతి విద్యార్థులకూ మెరిట్ లిస్ట్‌ను ప్రకటించట్లేదని సీబీఎస్‌ఈ వెల్లడించింది. మే 16వ తేదీ నుంచి రీ ఎవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇక, ఈ ఉదయం విడుదలైన సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో 87.33శాతం మంది ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కెనడాలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ ముప్పు.. స్పందించిన జై శంకర్
-
General News
Avinash Reddy: వివేకా హత్యకేసులో 8వ నిందితుడిగా అవినాష్‌రెడ్డి: సీబీఐ
-
Movies News
ott movies: ఈ వారం ఓటీటీలో 17 సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
-
India News
Air India: విమానం రష్యాకు మళ్లించిన ఘటన.. ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్
-
Politics News
Nara Lokesh: జగన్ పులివెందులకు ఏం చేశారు?: నారా లోకేశ్
-
Sports News
WTC Final: అదేం ఫీల్డింగ్.. రోహిత్ కెప్టెన్సీపై దాదా విసుర్లు!