CBSE టెన్త్‌, 12 పరీక్షల ఫైనల్‌ డేట్‌ షీట్స్‌ విడుదల

Eenadu icon
By Features Desk Updated : 30 Oct 2025 17:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

దిల్లీ: 2026లో జరగనున్న సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు ఫైనల్‌ డేట్‌ షీట్‌లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయని సీబీఎస్‌ఈ (CBSE) స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు; 12వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ 9 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ బోర్డు కంట్రోలర్‌ (ఎగ్జామ్స్) భరద్వాజ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. రోజూ ఈ పరీక్షలు ఉదయం 10.30గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు.(CBSE final Date sheets)

పది, 12 తరగతి పరీక్షల ఫైనల్‌ డేట్‌షీట్ల కోసం క్లిక్‌ చేయండి

సీబీఎస్‌ఈ తొమ్మిది, 11వ తరగతి విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ డేటా ఆధారంగా గత నెలలో ఈ పరీక్షలకు తాత్కాలిక డేట్‌షీట్‌లను విడుదల చేసిన విషయాన్ని ఈ సందర్భంగా బోర్డు గుర్తు చేసింది. అయితే, అన్ని పాఠశాలూ తమ విద్యార్థుల జాబితా (ఎల్‌ఓసీ)లను సమర్పించడంతో ఆ డేటా ఆధారంగా తాజాగా సీబీఎస్‌ఈ పరీక్షల తుది డేట్‌ షీట్‌లను సిద్ధం చేసి విడుదల చేసినట్లు పేర్కొంది. సకాలంలో జాబితాలు ఇవ్వడం వల్లే తొలిసారి ఈ పరీక్షలకు 110 రోజుల ముందుగా తుది డేట్‌ షీట్‌లను విడుదల చేసినట్లు తెలిపింది. 

రెండు సబ్జెక్టుల మధ్య విద్యార్థులకు తగినంత సమయం ఉండేలా చూడటంతో పాటు 12వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్‌ షీట్‌లను సిద్ధం చేసినట్లు బోర్డు పేర్కొంది. విద్యార్థులకు ప్రవేశ పరీక్షల కంటే చాలా ముందుగానే బోర్డు పరీక్షలను ముగించే ప్రయత్నం చేయడం ద్వారా ఇటు బోర్డు పరీక్షలు, అటు ప్రవేశ పరీక్షలకు తమ సమయాన్ని మెరుగ్గా వినియోగించుకోగలుగుతారని తెలిపింది. పరీక్షల ఆందోళనను అధిగమించి తమ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరుచుకొనేందుకూ ఈ చర్యలు ఉపయోగపడతాయని పేర్కొంది.


Published : 30 Oct 2025 17:31 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని