CBSE: మోటూ పత్లూ.. ‘ఆదాయపు పన్ను దేవత’ కథ: CBSE వినూత్న ప్రయత్నం

ఇంటర్నెట్ డెస్క్: పాఠశాల విద్యార్థుల్లో ఆదాయపు పన్ను(Income Tax)పై అవగాహన కల్పించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు(CBSE) వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. పాపులర్ కార్టూన్ పాత్రలైన ‘మోటూ పత్లూ’తో కామిక్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదాయపు పన్ను శాఖతో కలిసి దీనిపై అవగాహన పెంచేలా తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం, గుజరాతీ భాషల్లో ఎనిమిది కామిక్ పుస్తకాల్ని పరిచయం చేస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆదాయ పన్ను శాఖ రూపొందించి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన ఎనిమిది కామిక్ పుస్తకాలివే..
- మోటూ పత్లూ- చట్టానికి కట్టుబడి ఉండటం వల్ల ప్రయోజనాలు
 - మోటూ పత్లూ- అభివృద్ధి చెందిన భారతదేశం
 - మోటూ పత్లూ- కలిసి ముందుకు సాగుదాం
 - మోటూ పత్లూ- ఆన్లైన్ జీవితం
 - మోటూ పత్లూ- భయంపై విజయం
 - మోటూ పత్లూ-ఆదాయపు పన్ను కథ
 - మోటూ పత్లూ-ఆదాయపు పన్ను దేవత
 - మోటూ పత్లూ- పాన్‌కార్డు కథ
 
దేశ అభివృద్ధిలో ఆదాయపు పన్ను పాత్రపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా తీసుకొచ్చిన ఈ కామిక్ సిరీస్‌లను ఆదాయపు పన్ను శాఖకు చెందిన పబ్లిక్ రిలేషన్స్, పబ్లికేషన్స్ విభాగం రూపొందించింది. వీటిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని తన అనుబంధ పాఠశాలలను సీబీఎస్‌ఈ కోరింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

యువతిపై గ్యాంగ్ రేప్: ఎయిర్ పోర్ట్ వద్ద నిందితులపై ఎన్కౌంటర్
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 - 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 


