CUET PG Results: సీయూఈటీ(పీజీ) పరీక్ష ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (CUET-PG) ఫలితాలు విడుదలయ్యాయి. 

Published : 21 Jul 2023 02:17 IST

విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (CUET-PG) ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాలను గురువారం రాత్రి ఎన్‌టీఏ అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విశ్వవిద్యాలయాల జాబితాను కూడా ఫలితాలతో కలిపి ఇచ్చారు. పూర్తి సమాచారం కోసం విద్యార్థులు సంబంధిత విశ్వవిద్యాలయాలతో సంప్రదించవచ్చని ఎన్టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ సాధన పరశర్‌ పేర్కొన్నారు. స్కోర్‌ కార్డ్‌ ఆధారంగా యూనివర్సిటీలు కౌన్సిలింగ్‌పై నిర్ణయం తీసుకుంటాయని ఎన్టీఏ తెలిపింది. జూన్‌లో దేశవ్యాప్తంగా 295 నగరాలు, విదేశాల్లోని 24 సిటీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8.7లక్షల మంది హాజరయ్యారు. ఫలితాలను https://cuet.nta.nic.in/లో చెక్‌చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని