CUET (PG) Results: సీయూఈటీ (పీజీ) ఫలితాలపై యూజీసీ ఛైర్మన్‌ ట్వీట్‌

దేశంలోని పలు వర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీయూఈటీ(పీజీ) ప్రవేశ పరీక్ష ఫలితాలు ఈ రాత్రి, లేదంటే శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు యూజీసీ ఛైర్మన్‌ ట్వీట్‌ చేశారు. 

Published : 20 Jul 2023 16:52 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన  కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్టు (CUET-PG) ఫలితాలపై యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ కీలక ప్రకటన చేశారు. ఈరోజు రాత్రి లేదంటే శుక్రవారం ఉదయం పరీక్ష ఫలితాలు వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అభ్యర్థులు పరీక్ష ఫలితాల అప్‌డేట్స్‌ కోసం NTA వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని సూచించారు.

పెట్రోల్‌ ధరలు ఏపీలోనే అధికం.. ఇతర రాష్ట్రాల్లో ఇలా..

 జూన్‌ 5 నుంచి 8వ తేదీ వరకు సీయూఈటీ (పీజీ) పరీక్షలు జరిగాయి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30గంటల వరకు మొదటి షిఫ్టు, మధ్యాహ్నం 12గంటల నుంచి 2గంటల వరకు రెండో షిఫ్టు, మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు మూడో షిఫ్టులో ఈ పరీక్ష నిర్వహించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని