Petrol Price: పెట్రోల్‌ ధరలు ఏపీలోనే అధికం.. ఇతర రాష్ట్రాల్లో ఇలా..

పెట్రోల్‌ ధరల్లో దేశంలోనే ఏపీ (లీటర్‌కు రూ.111.87) మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 29 Apr 2024 16:07 IST

దిల్లీ:  పెట్రోల్‌(Petrol) ధరలు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోనే  అధికంగా ఉన్నట్టు (లీటర్‌కు రూ.111.87) కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డీజిల్‌(Desel) ధరల్లో లక్షద్వీప్‌ తొలి స్థానంలో నిలవగా.. ఏపీ రెండో స్థానం (రూ.99.61)లో ఉందని పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అని రాజస్థాన్‌కు చెందిన భాజపా ఎంపీ రాహుల్‌ కశ్వాన్‌(Rahul Kaswan) అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురి(Hardeep Singh Puri) లోక్‌సభ(Lok Sabha)కు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఒకే చమురు ధరల విధానం ఇప్పటివరకు లేదన్న ఆయన..   రాష్ట్రాల్లో పన్ను ఆధారంగా ధరలు ఉన్నట్టు తెలిపారు. 

మణిపుర్‌ ఘటనపై అట్టుడికిన రాజ్యసభ

ఇందులో భాగంగా జులై 18వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలు, ముఖ్య పట్టణాల్లో ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల వివరాలను వెల్లడించిన కేంద్రం.. ఏపీలో రిఫరెన్స్‌ సిటీగా అమరావతిని పేర్కొంటూ ధరలు సేకరించింది. అమరావతిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.111.87లు ఉండగా.. డీజిల్‌ ధర 99.61గా ఉన్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇకపోతే, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంలో లీటర్ పెట్రోల్‌ రూ.109.66 కాగా.. డీజిల్‌ ధర రూ.97.82గా ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు 2020 ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దిల్లీ నగరంలో పెరిగిన ధరల వివరాలతో వేర్వేరుగా పట్టికలు విడుదల చేసింది. 

రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవే..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు