EMRS Job Notifications: ఏకలవ్య స్కూల్స్‌లో 10వేలకు పైగా పోస్టులు.. దరఖాస్తు చేశారా?

EMRS Job Recruitment: ఏకలవ్య ఆదర్శ రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోండి.

Published : 21 Jul 2023 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్సియల్‌ పాఠశాల(EMRS)ల్లో సిబ్బంది నియామకానికి భారీ నోటిఫికేషన్లు వెలువడిన విషయం తెలిసిందే.  రెండు వేర్వేరు నోటిఫికేషన్లతో మొత్తం 10,391 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని భర్తీ చేసేందుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. జూన్‌ నెలాఖరున 4,062 పోస్టులకు మొదటి నోటిఫికేషన్‌ విడుదల కాగా.. దరఖాస్తుల సమర్పణకు ఇంకా కొద్ది రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొత్తగా మరో 6 వేలకు పైగా పోస్టుల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ (TGT) సహా మొత్తం 6,329 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(NESTS) నోటిఫికేషన్‌ ఇచ్చింది.

భారీ వేతనం.. ఏకలవ్య స్కూల్స్‌లో 6,329 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆకర్షణీయ వేతనాలతో ప్రిన్సిపల్‌, పీజీటీ, అకౌంటెంట్‌తో పాటు మొత్తం  4,062 పోస్టులకు గత నెలలో విడుదలైన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల గడువు జులై 31తో ముగియనుండగా.. టీజీటీ, లైబ్రేరియన్‌, హాస్టల్‌ వార్డెన్‌ సహా మొత్తం 6,329 పోస్టులకు దరఖాస్తుల గడువు ఆగస్టు 18 వరకు ఉంది. అర్హులైన అభ్యర్థులు  https://emrs.tribal.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏకలవ్య స్కూళ్లలో 4,062 ఉద్యోగాలు.. భారీగా వేతనం!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని