EMRS Recruitment: భారీ వేతనం.. ఏకలవ్య స్కూల్స్‌లో 6,329 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ఏకలవ్య పాఠశాలల్లో భారీగా టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 18లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 20 Jul 2023 19:21 IST

దిల్లీ:  దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో(EMRS) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 6,329 టీచింగ్‌, నాన్‌ టీచింగ్ (టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌) పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజ‌న వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సోసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(NESTS) తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ పోస్టులకు భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు ఆగస్టు 18 వరకు వరకు https://emrs.tribal.gov.in/   వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే.. 

  • ఉద్యోగ ఖాళీలు.. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (TGT)  ఖాళీలు 5660.  సబ్జెక్టుల వారీగా చూస్తే హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్‌, ఆర్ట్‌, పీటీటీ (మేల్‌), పీఈటీ (ఫిమేల్‌), లైబ్రేరియన్ చొప్పున ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటు  మ్యూజిక్‌, ఆర్ట్‌, పీఈటీ (పురుషులు), పీఈటీ (మహిళలు), లైబ్రేరియన్‌ విభాగంలోనూ ఖాళీలను భర్తీ చేయనున్నారు.  వీటితో పాటు  హాస్టల్‌ వార్డెన్‌ పురుషుల విభాగంలో 335 ఖాళీలు, మహిళల విభాగంలో 334 చొప్పున పోస్టులను భర్తీ చేయనున్నారు. 

ఐబీపీఎస్‌ క్లర్క్‌ పోస్టులకు అప్లై చేశారా? అయితే.. మీ CIBIL స్కోరు పెంచుకోండి!

  • అర్హతలు: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ; టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. హాస్టల్‌ వార్డెన్ పోస్టులకు ఏదైనా డిగ్రీ  ఉంటే చాలు.
  • వయోపరిమితి: 18.8.2023 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • జీత భత్యాలు: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44900-142400/ రూ.35400-112400; హాస్టల్ వార్డెన్‌కు రూ.29200-92300.
  • దరఖాస్తు ఫీజు: టీజీటీ పోస్టులకు రూ.1500; హాస్టల్ వార్డెన్ రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులైతే ఎలాంటి ఫీజు చెల్లించనవసరంలేదు.
  • ఎంపిక ప్రక్రియ: ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • పరీక్ష విధానం: ఓఎంఆర్‌ ఆధారిత(పెన్‌ పేపర్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్ వార్డెన్‌ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్ వార్డెన్‌ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని