ఐటీఐతో నేవీ కొలువు!

భారత నౌకాదళం 554 ట్రేడ్స్‌మెన్‌ మ్యాట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. పదోతరగతి అనంతరం ఐటీఐ కోర్సులు పూర్తిచేసినవారు వీటికి పోటీపడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు నేవల్‌ కమాండ్స్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

Updated : 15 Feb 2024 16:31 IST

554 ట్రేడ్స్‌మెన్‌ పోస్టుల నియామకానికి ప్రకటన

భారత నౌకాదళం 554 ట్రేడ్స్‌మెన్‌ మ్యాట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. పదోతరగతి అనంతరం ఐటీఐ కోర్సులు పూర్తిచేసినవారు వీటికి పోటీపడవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు నేవల్‌ కమాండ్స్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగంలో చేరినవారికి నెలకు రూ.18,000 మూలవేతనం లభిస్తుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ..తదితరాలతో కలుపుకుని రూ.27 వేల వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు. వీరు ప్రధానంగా జలాంతర్గాములు (సబ్‌మెరైన్లు), నౌకల తయారీ/నిర్వహణ విధుల్లో పాల్గొంటారు. వీటికి సంబంధించిన వివరాలు నమోదు...తదితరాలు వీరి బాధ్యతల్లో భాగం.
ఈ పోస్టుల నియామకానికి ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో 25, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌లో  25, జనరల్‌ ఇంగ్లిష్‌లో 25, జనరల్‌ అవేర్‌నెస్‌లో 25 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

* జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌లో మ్యాథ్స్‌ ఆపరేషన్స్‌, సిరీస్‌, ఆడ్‌మెన్‌ అవుట్‌, లాజికల్‌ వెన్‌ డయాగ్రమ్‌లు, అనాలజీ, వర్డ్‌ బేస్డ్‌ ప్రాబ్లమ్స్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డ్రాయింగ్‌ ఇంటర్‌ఫిరెన్స్‌, కోడింగ్‌ డీకోడింగ్‌, నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.
* న్యూమరికల్‌  ఎబిలిటీలో సంఖ్యా విధానాలు, కాలం-పని, క్షేత్రమితి (మెన్సురేషన్‌), నిష్పత్తి-అనుపాతం, సరాసరి, లాభనష్టాలు, రాయితీ, శాతాలు, కాలం-దూరం, వడ్డీలు, గణాంక చార్టులు, చలన జ్యామితి, త్రికోణమితుల్లో ప్రశ్నలుంటాయి.
* ఇంగ్లిష్‌ విభాగంలో... పదసంపద, వ్యాకరణం, వాక్య నిర్మాణం, సమానార్థాలు, వ్యతిరేక అర్థాలు, గ్రహణ, వాడుక...తదితర అంశాల నుంచి అడుగుతారు.
* జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగంలో... పొరుగు దేశాలతో భారత్‌ సంబంధాలు, క్రీడలు, చరిత్ర, సంస్కృతి, భౌగోళికాంశాలు, భౌతిక, రసాయన శాస్త్రాలు, పర్యావరణం, ఆర్థిక, వర్తమాన అంశాలు, విధివిధానాలు, భారత రాజ్యాంగం, సైన్స్‌ పరిశోధనల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* ప్రశ్నలన్నీ సాధారణ స్థాయిలోనే ఉంటాయి. వీటికి జవాబులు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. 8, 9, 10 తరగతుల పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది.

ఎక్కడ ఎన్ని ఖాళీలు?

కమాండ్ల వారీగా:  విశాఖపట్నం 46, ముంబయి 502,  కొచ్చి 6
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి.
వయసు:  మార్చి 15, 2019 నాటికి  18-25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తులకు చివరి తేదీ:  మార్చి 15 సాయంత్రం 5 గంటల వరకు
దరఖాస్తు ఫీజు: రూ.205 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు)
పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని