కొలువుల పోటీలు

క్యాంపస్‌లో అవకాశం చేజారితే? అసలు కాలేజీలో క్యాంపస్‌ నియామకాలే  లేకపోతే? ప్రతిభ వృథా కావాల్సిందేనా? లేదు! ఇలాంటివారికోసమే టాటా  కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలను ఆన్‌లైన్‌లో  నిర్వహిస్తోంది. ఇందులో నెగ్గితే టీసీఎస్‌లో చేరిపోవచ్చు....

Updated : 15 Feb 2024 16:48 IST

విద్యార్థులకు టీసీఎస్‌ ఆహ్వానం

క్యాంపస్‌లో అవకాశం చేజారితే? అసలు కాలేజీలో క్యాంపస్‌ నియామకాలే  లేకపోతే? ప్రతిభ వృథా కావాల్సిందేనా? లేదు! ఇలాంటివారికోసమే టాటా  కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆఫ్‌ క్యాంపస్‌ నియామకాలను ఆన్‌లైన్‌లో  నిర్వహిస్తోంది. ఇందులో నెగ్గితే టీసీఎస్‌లో చేరిపోవచ్చు. ఈ ఏడు కోర్సులు పూర్తిచేసినవారూ, 2023లోపు పూర్తిచేయబోతోన్న విద్యార్థులూ పరీక్షలు  రాసుకోవచ్చు. బీసీఏ, బీఎస్సీ కోర్సులు చదివినవారికి సైతం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి శిక్షణ అనంతరం కొలువులను అందిస్తోంది టీసీఎస్‌!

బీఎస్సీ, బీసీఏ; బీఈ, బీటెక్‌; ఎంఈ, ఎంటెక్‌; ఎమ్మెస్సీ, ఎంసీఏ... చదువుతోన్న కోర్సు ఏదైనప్పటికీ. ప్రతిభ ఉన్న విద్యార్థులకు టీసీఎస్‌ ఆహ్వానం పలుకుతోంది. కోడింగ్‌లో మెరిస్తే కొలువులు అందిస్తోంది. అభ్యర్థులు తమకు సరిపడే విభాగాన్ని ఎంచుకుని అందులో పరీక్ష రాసి, ఇంటర్వ్యూలో నెగ్గితే ఉద్యోగం ఖాయమవుతోంది. ఇందుకోసం నేషనల్‌ క్వాలిఫయింగ్‌ టెస్టు 2019, 2020; కోడ్‌విటా-8, ఎన్‌కోడ్‌, ఎన్‌క్యూటీ-బీఎస్సీ, బీసీఏ పరీక్షలను నిర్వహిస్తోంది. 
వెబ్‌సైట్‌: www.careers.tcs.com 


టీసీఎస్‌ ఆఫ్‌ క్యాంపస్‌ టెస్టు (నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు) 
ఎవరి కోసం: 2019 లో ఆఖరు సంవత్సరం కోర్సులు పూర్తిచేసుకున్న బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీ, ఎంసీఏ విద్యార్థులకు. ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచ్‌ల వాళ్లూ ఈ పరీక్ష రాసుకోవచ్చు. యూజీలో మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా చదువుకున్న ఎంసీఏ విద్యార్థులు, ఎమ్మెస్సీ - ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదువుకున్నవారు అర్హులు. 
ఎంత శాతం మార్కులు: పది, ఇంటర్‌/  డిప్లొమా,  యూజీ/  పీజీ అన్నింటా కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. 


రిజిస్ట్రేషన్లకు గడువు: జూన్‌ 10 
పరీక్ష తేదీ: జూన్‌ 16 
నియామకం ఇలా: ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఎంపికైనవారికి ముఖాముఖి ఉంటుంది. ఇందులో 3 దశలు అవి టెక్నికల్‌, మేనేజీరియల్‌, హెచ్‌ఆర్‌ రౌండ్‌ ఉంటాయి. 


ఎన్‌క్యూటీ: బీఎస్సీ/  బీసీఏ 
బీఎస్సీ, బీసీఏ కోర్సులు 2019లో పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం టీసీఎస్‌ ప్రత్యేకంగా నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ) నిర్వహిస్తోంది. ఇందులో ఎంపికైనవారిని ఇగ్నైట్‌ ప్రోగ్రాంలోకి తీసుకుంటారు. వీరికి కొత్త టెక్నాలజీల్లో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. ఈ విధానంలో చేరినవాళ్లు టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తూనే ఎంసీఏ కోర్సు చదువుకునే సౌలభ్యాన్నీ కల్పించారు.


 రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జూన్‌ 10 పరీక్ష తేదీ: జూన్‌ 17 
ఎవరు అర్హులు:  బీసీఏ, బీఎస్సీ -2019లో పూర్తిచేసుకున్న వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/  సైన్స్‌ వీటిలో ఏ కోర్సు చదువుకున్నవారైనా అర్హులే. 
ఎంత శాతం మార్కులు: పదో తరగతి, ఇంటర్‌, బీఎస్సీ/  బీసీఏ ప్రతి తరగతిలోనూ కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. 
ఎంపిక విధానం: పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా 


కోడ్‌ విటా 
కంప్యూటర్‌ భాష కోడ్‌లో మెరికలు డిజిటల్‌ ప్రపంచంలో దూసుకుపోవడానికి కోడ్‌ విటా సరైన వేదిక. ఇందులో మంచి ప్రతిభ చూపినవారికి టీసీఎస్‌లో ఆకర్షణీయ వేతనంతో ఉద్యోగమూ దక్కుతుంది. ప్రీ క్వాలిఫయర్‌ రౌండ్‌ దాటినవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అభ్యర్థుల ప్రోగ్రామింగ్‌ స్కిల్స్‌ పదునుపెట్టడానికి కోడ్‌ విటా దోహదపడుతుంది. 
ఎవరి కోసం: 2020, 2021, 2022, 2023లో ఇంజినీరింగ్‌/సైన్స్‌ నేపథ్యంతో యూజీ / పీజీ కోర్సులు పూర్తిచేయబోతోన్న విద్యార్థులకు. 
ఎంపిక విధానం: ఇందులో 3 రౌండ్లు ఉంటాయి. మొదటిది ప్రీ క్వాలిఫయర్‌ జోనల్‌ రౌండ్‌. రెండోది క్వాలిఫయర్‌ మూడోది ఫైనల్‌. 
ఎప్పుడు, ఎక్కడ: రౌండ్‌-1 ఆన్‌లైన్‌లో జూన్‌ 28 నుంచి జులై 13 వరకు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైనవారికి రెండో రౌండ్‌ కూడా ఆన్‌లైన్‌లోనే డిసెంబరు 8 నుంచి 10 వరకు ఉంటుంది. ఫైనల్స్‌ ఫిబ్రవరి 26, 2020న ఎంపిక చేసిన ప్రాంతంలో నిర్వహిస్తారు. 


ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన‌ గడువు: జూన్‌ 24 
ఎన్‌కోడ్‌, టీసీఎస్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్టు (ఎన్‌క్యూటీ)-2020 
పోటీల వివరాలు www.eenadupratibha.netTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని