నోటిఫికేషన్స్‌

 న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, వివిధ విభాగాల్లో  మెడికల్‌ ఆఫీసర్‌/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 నిర్వహిస్తోంది.

Published : 12 Apr 2024 00:28 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
యూపీఎస్సీ- కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ 2024

 న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, వివిధ విభాగాల్లో  మెడికల్‌ ఆఫీసర్‌/ జీడీఎంవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2024 నిర్వహిస్తోంది.

 మొత్తం పోస్టులు: 827

కేటగిరీ-1: మెడికల్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌ (జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్స్‌ సబ్‌-క్యాడర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌): 163
కేటగిరీ-2: 1. అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (రైల్వే): 450
2. జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ (న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌): 14
3. జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 (దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌): 200

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి: 1.8.2024 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్‌: నెలకు రూ.56,100 - 1,77,500
దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (500 మార్కులు), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ (100 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2024.
దరఖాస్తులో సవరణకు చివరి తేదీ: 7 మే 2024.
రాత పరీక్ష తేదీ: 14 జులై 2024.
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


ఎన్‌పీసీఐఎల్‌, ముంబయిలో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

ముంబయిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ - న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌) వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 400   (ప్రస్తుత ఖాళీలు- 396, బ్యాక్‌లాగ్‌ ఖాళీలు- 04)

విభాగాలు: మెకానికల్‌, కెమికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సివిల్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి.  
వయో పరిమితి: 30 ఏప్రిల్‌ 2024 నాటికి 26 సంవత్సరాలు మించకూడదు.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.
ఎంపిక ప్రక్రియ: గేట్‌ 2022/ 2023/ 2024 స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2024.
వెబ్‌సైట్‌:  https://npcilcareers.co.in/MainSiten/default.aspx

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని