కరెంట్‌ అఫైర్స్‌

ఒలింపిక్‌ షూటింగ్‌ ట్రయల్స్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు.

Published : 29 Apr 2024 00:12 IST

లింపిక్‌ షూటింగ్‌ ట్రయల్స్‌ 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో అర్జున్‌ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. 2024, ఏప్రిల్‌ 25న దిల్లీలో జరిగిన మ్యాచ్‌లో అతడు 2.8 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్‌ రుద్రాంక్ష్ను ఓడించి విజేతగా నిలిచాడు. ఒలింపిక్‌ కోటా విజేత అయిన అర్జున్‌, దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ రికార్డు (253.7)ను అధిగమించాడు.


సియా అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో 2024, ఏప్రిల్‌ 25న జరిగిన మ్యాచ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌, ఏక్తా, అనురాగ్‌ స్వర్ణాలు గెలిచారు. పురుషుల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌లో రణ్‌వీర్‌ 9 నిమిషాల 22.62 సెకన్ల ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. మహిళల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌లో ఏక్తా 10 నిమిషాల 31.92 సెకన్ల టైమింగ్‌తో పసిడి సొంతం చేసుకుంది. పురుషుల షాట్‌పుట్‌లో అనురాగ్‌ సింగ్‌ 19.23 మీటర్ల దూరం గుండును విసిరి బంగారు పతకాన్ని నెగ్గాడు.

2024, ఏప్రిల్‌ 26న జరిగిన మ్యాచ్‌లో లక్షిత వినోద్‌ రజతం, శ్రీయ రాజేశ్‌ కాంస్యం గెలుచుకున్నారు. 800 మీటర్ల పరుగులో లక్షిత (2 నిమిషాల 7.10 సెకన్లు) రెండో స్థానంలో నిలిచింది. 400 మీటర్ల పరుగులో శ్రీయ (59.20 సెకన్లు) మూడో స్థానం పొందింది.


భారత జీడీపీ వృద్ధి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6.6% నమోదు కావొచ్చని డెలాయిట్‌ ఇండియా అంచనా వేసింది. వినియోగ వ్యయాలు, ఎగుమతులు, పెట్టుబడుల వృద్ధి ఇందుకు దోహదపడొచ్చని తెలిపింది. ‘ఇండియా ఎకనామిక్‌ అవుట్‌లుక్‌’ పేరిట డెలాయిట్‌ ఈ నివేదిక వెలువరించింది.

2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిని 7.6 నుంచి 7.8 శాతానికి డెలాయిట్‌ సవరించింది..


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


కరెంట్‌ అఫైర్స్‌

మాదిరి ప్రశ్నలు

  • ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ కార్యక్రమం కింద ఉత్తర భారతదేశంలోనే మొదటిసారిగా ఏ విద్యాసంస్థ మానవ డీఎన్‌ఏ బ్యాంక్‌ను ప్రారంభించింది?

జ: బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం

  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన తాంథై పెరియార్‌ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

జ: తమిళనాడు  

  • 2024-25 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో ఏ మంత్రిత్వ శాఖ అత్యధికంగా రూ.6,21,540.85 కోట్ల బడ్జెట్ కేటాయింపులను పొందింది?

జ: రక్షణ మంత్రిత్వ శాఖ  

  • 2024, ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం (వరల్డ్‌ వెట్‌ ల్యాండ్‌ డే) ను ఏ థీమ్‌తో నిర్వహించారు?

జ: వెట్‌ల్యాండ్స్‌ అండ్‌ హ్యూమన్‌ వెల్‌బీయింగ్‌

  • ‘సాక్షం అంగన్‌వాడీ, పోషణ్‌ 2.0 పథకం’ను ఏ కేంద్ర మంత్రిత్వశాఖ అమలు చేసింది?

జ: మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ

  • 2024-25 కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించిన ‘బ్లూ ఎకానమీ 2.0’ అనేది దేనికి సంబంధించింది?

జ: సముద్రాలు, మహాసముద్రాలు, తీరప్రాంతాలు

  • ఏ రాష్ట్ర కేబినెట్‌ ఇటీవల యూనిఫాం సివిల్‌ కోడ్‌ (యూసీసీ) బిల్లుకు ఆమోదం తెలిపింది?

జ: ఉత్తరాఖండ్‌  

  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఏ నగరం ఇటీవల కేంద్ర జల మంత్రిత్వశాఖ అందించే ‘వాటర్‌ వారియర్‌’ పురస్కారాన్ని గెలుచుకుంది?

జ: నోయిడా

  • సీనియర్‌ సిటిజన్ల కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన’ ను ప్రారంభించింది?

జ: మహారాష్ట్ర

  • ఇటీవల వార్తల్లోకి వచ్చిన మహ్ముదియా చిత్తడి నేలలు ఏ దేశంలో ఉన్నాయి?

జ: రొమేనియా  

  • 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు టార్చ్‌ బేరర్‌గా ఎవరు ఎంపికయ్యారు?

జ: అభినవ్‌ బింద్రా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని