Income Tax Jobs: ఐటీ శాఖలో 291 ఉద్యోగాలు.. వాళ్లకు మాత్రమే!

ముంబయిలోని ఐటీ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభావంతులు ఈ పోస్టులకు జనవరి 19వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.

Updated : 26 Dec 2023 21:13 IST

ముంబయి: ఆదాయపన్ను శాఖలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ముంబయిలో మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది, ట్యాక్స్‌ అసిస్టెంట్లతో పాటు మొత్తం 291 ఉద్యోగాలకు స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 19వరకు ఆన్‌లైన్‌లో https://incometaxmumbai.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు. క్రీడా రంగంలో అంతర్జాతీయ/జాతీయ/ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌/తదితర స్థాయిల్లోని పలు క్రీడల్లో ప్రతిభకనబరిచిన వారికే ఈ ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఉంటుంది. 

నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలివే..

  • మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. వీటిలో అధికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌ (ఎంటీఎస్‌) పోస్టులు 137; ట్యాక్స్‌ అసిస్టెంట్‌ (టీఏ) 119; స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ -II (స్టెనో) 18; ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ (ఐటీఐ) 14; క్యాంటీన్‌ అటెండెంట్‌ (సీఏ) మూడు చొప్పున ఉన్నాయి.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు క్రికెట్‌, ఆర్చరీ, అథ్లటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, బాక్సింగ్‌, చెస్‌, సైక్లింగ్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కరాటే, టెన్నిస్‌, రెజ్లింగ్‌, యోగాసన, టెన్నిస్‌బాల్‌ క్రికెట్‌, ఖోఖో సహా మొత్తం 65 క్రీడాంశాల్లో ఏదైనా దాంట్లో ప్రతిభావంతులై ఉండాలి.
  • వయో పరిమితి: ఆయా పోస్టులను బట్టి 2023 జనవరి 1నాటికి 18 నుంచి గరిష్ఠంగా 30 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్లను బట్టి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
  • దరఖాస్తు రుసుం: రూ.200 ఒకే దరఖాస్తులో పై పోస్టులన్నింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • విద్యార్హతలు: ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ట్యాక్స్‌ అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ తప్పనిసరి. అలాగే, స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు 12వ తరగతి పాసై ఉండాలి. ఎంటీఎస్‌, క్యాంటీన్‌ అటెండెంట్‌ పోస్టులకు మెట్రిక్యులేషన్‌ తత్సమాన విద్యార్హత ఉండాలి.
  • వేతనం: ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఉద్యోగాలకు వేతనం రూ. 44,900 నుంచి 1,42,400 కాగా; స్టెనో, ట్యాక్స్‌ అసిస్టెంట్‌లకు రూ.25,500-81,100; ఎంటీఎస్‌, క్యాంటీన్‌ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 -రూ.56,900ల చొప్పున ఇవ్వనున్నారు. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని